schedule Friday, June 19, 2026

కోస్గిలో తైక్వాండో క్రీడాకారులకి బెల్ట్, సర్టిఫికెట్ అందజేత 

calendar_today September 23, 2024
person meenewstelugu
కోస్గిలో తైక్వాండో క్రీడాకారులకి బెల్ట్, సర్టిఫికెట్ అందజేత 

కోస్గిలో తైక్వాండో క్రీడాకారులకి

బెల్ట్, సర్టిఫికెట్ అందజేత

బాలికలపై అఘాయిత్యాలు జరుగకుండా తైక్వాండో క్రీడ ఉపయోగపడుతుంది

కోస్గి గ్లోబల్ స్కూల్ ప్రిన్సిపల్ కిరణ్, మాస్టర్‌ మనోహర్‌

మీ::న్యూస్ ప్రతినిధి కోస్గి: తైక్వాండో క్రీడా తనను తాను రక్షించుకునేందుకు ఎంతగానో ఉపయోగపడు తుందని నారాయణపేట్ జిల్లా కోస్గి గ్లోబల్ స్కూల్ ప్రిన్సిపల్ కిరణ్, వికారాబాద్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి మాస్టర్‌ మనోహర్‌ అన్నారు. ఆది వారం నారాయణపేట్ జిల్లా కోస్గి పట్టణంలోని గ్లోబల్ స్కూల్ పాఠశాలలో స్థానిక కోస్గి కోచ్ వెంకటయ్య ఆధ్వర్యంలో.. తైక్వాండో క్రీడాకారులకు బెల్ట్ సర్టిఫికెట్ పరీక్షలు నిర్వహించారు.

అనంతరం ముఖ్య అతిథులు ప్రిన్సిపల్ కిరణ్, మాస్టర్ మనోహర్  చేతుల మీదుగాక్రీడాకారులకు ప్రదానం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. బాలికలపై అఘాయిత్యాలుజరుగకుండా, బాలి కలకు ఈ క్రీడా తనను తాను రక్షించుకునేందుకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. చదువుతోపాటు ఈ క్రీడ భవిష్యత్‌లో రాణించేం దుకు వీలుగా ఉంటుందని స్పష్టం చేశారు. శిక్షణ విభాగం లో క్రీడాకారులకు పరీక్షలలో ఫైటింగ్ , పూంసే,హాండ్ మూమెంట్స్ , సెల్ఫ్ డిఫెన్స్ , నుంచాక్ , స్టిక్ తదితర అంశాలపై మెరుగైన శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారుల తల్లిదండ్రులు, తైక్వాండో క్రీడాకారులు పాల్గొన్నారు.