schedule Wednesday, June 17, 2026

అంజన పూరి కాలనీ సీసీ రోడ్డు మంజూరు 

calendar_today September 12, 2024
person meenewstelugu

అంజన పూరి కాలనీ సీసీ రోడ్డు మంజూరు 

 --రెండు మూడు నాలుగు నంబరు రోడ్లు పరిస్థితి దారుణంగా ఉంది 

 --కాలనీలో కుక్కల బెడద ఎక్కువ 

 --మున్సిపల్ కమిషనర్ కి గతి పత్రం ఇచ్చిన మహిళలు 

 మీ న్యూస్ ప్రతినిధి

అంజనపురి కాలనీ ఒకటో నెంబర్ 2 3 4 ఇక్కడ రోడ్ల పరిస్థితి చాలా బురద భయం గా ఉన్నది సీసీ రోడ్లు గతంలో శాంక్షన్ అయి టెండర్లు కూడా వేయడం జరిగింది ఇంతలో ఎన్నికల కోడ్ వచ్చిందని ఆపేశారు అందుకని సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ కాలనీ మహిళలు చెరుకు ఏకలక్ష్మి ప్రేమ కుమారి జ్యోతి సంతోషి అర్చన అమల సత్యవతి అరుణ కమిషనర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గతంలో వేసిన టెండర్లు ఇప్పుడు తొలగించారని కమిషనర్ చెప్పడం జరిగింది మళ్లీ కొత్తగా టెండర్లు వేయాలని చెప్తున్నారు. కానీ ఈ రోడ్లలో నడవడం చాలా కష్టంగా ఉన్నదని కాలనీలో సీసీ రోడ్లు డ్రైనేజీ వెంటనే నిర్మించాలని కోరుచున్నాము వార్డ్ లో కుక్కల బెడద ఎక్కువగా ఉన్నందున చిన్నపిల్లలు మహిళల వెంట కుక్కలు పడుతున్నాయి వాటిని కూడా పట్టుకు వెళ్లాలని చెట్లు గుబురుగా పెరిగిపోయి రోడ్డుపైన వస్తుంటే కనీసం మనుషులు కూడా కనిపించినటువంటి చెట్లు పెరిగిపోయినాయి కాళీ ప్లాట్లలో నీరు చేరి బురదమయంగా మారిపోయి దోమలు పాములు ఇండ్లలోకి వస్తున్నాయి వీటివల్ల ప్రమాదాలు పొంచి ఉందని చెట్లు తొలగించి నీరు వెళ్లిపోయే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు