మన నీళ్లు.. మన హక్కు..!

రంగారెడ్డి రాజాకియం

   మన నీళ్లు.. మన హక్కు..!

.చలో నల్గొండ సభకు  తాండూరు గులాబీ దండు
. పైటెల్ ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్లిన బీఆర్ఎస్ శ్రేణులు
దీక్షతెలుగు న్యూస్, తాండూరు :

కృష్ణ బేసిన్ ప్రాజెక్టులను, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ను కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.మాజీ సీఎం సభకు భారీగా తాండూరు నుంచి వేలాది మంది నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివెళ్లారు. తాండూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుండి బీఆర్ఎస్ నేతలు,కార్యకర్తలు కలిసి ఆర్టీసీ బస్సులో సీఎం కేసీఆర్‌ సభకు వెళ్లారు.తాండూరు మండలం నుంచి మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ పటేల్ ఉమాశంకర్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు సాయిరెడ్డి, ఎంపీటీసీ వసంత్ కుమార్, శాంతు, రైతు సమితి కోఆర్డినేటర్ రాంలింగారెడ్డి, మాజీ సర్పంచులు రాజప్ప గౌడ్, ఎత్తరి రాములు, దశరథ్, నాయకులు వీరేందర్ రెడ్డి, మండల వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎం.ప్రకాష్, నూజీ సర్పంచ్ వెంకట్రాములు గౌడ్, బీసీ సెల్ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్, మాజీ ఉప సర్పంచులు జీవరత్నం, చిన్న మాధవరెడ్డి తదితరులు తరలివెళ్లారు. సందర్భంగా వారు మాట్లాడుతూ..

కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనంతో కృష్ణ నదిపై ప్రాజెక్టుల పెద్దతనని కేంద్రం చేతుల్లో పెట్టి..తెలంగాణను మళ్లీ ఎడారిలా చేసే కుట్రాలకు తేడా లేపిందని ఆరోపించారు.