కాంగ్రెస్ ఎన్నికలముందు ఇచ్చిన6 గ్యారెంటీలు అమలు చేయాలి
మీ న్యూస్ ప్రతినిధి అక్టోబర్ 24:: సూర్యాపేట టౌన్ : కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీ స్కీం లను వెంటనే అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని సీతారాంపురం ప్రియదర్శిని ఐటిఐ కాలేజీలో జరిగిన సిపిఎం పార్టీ సూర్యాపేట వన్ టౌన్ మహాసభకు సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు అర్వపల్లి లింగయ్య, గండమల్ల భాగ్యమ్మ, షేక్ సైదులు అధ్యక్ష వర్గంగా వ్యవహరించిన ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వాలు పెద్దలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు చేస్తూ పేదలను విస్మరిస్తున్నారని వారు విమర్శించారు. దేశంలోని మతోన్మాద శక్తులు బిజెపి దాని అనుబంధ సంఘాలు అధికారంలో ఉండటం వల్ల మైనార్టీ మతాలపై రోజురోజుకు తీవ్రమైన దాడులు పెరుగుతున్నాయని అన్నారు. పెట్టుబడిదారులకు అనుకూలమైన ఆర్థిక విధానాలను అమలు చేస్తూ దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని వారు విమర్శించారు. రాష్ట్రంలో అధికారులకు వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయని అన్నారు. అత్యంత నిరుపేదలైన వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయల ఇస్తామని, అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని, విద్యా, ఉద్యోగ నియమకాలను పూర్తి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నప్పటికీ ఏ ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేదని వారు ఆరోపించారు. రైతులందరికీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని మాటలకే పరిమితమైంది 60 శాతం మంది రైతుల కంటే ఎక్కువ రైతులకు రుణాలు మాఫీ చేయలేదుఅన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ తక్షణమే చేయాలని,గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బందులకు గురవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం తక్షణమే స్పందించి పట్టణాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించి ప్రజల ఆరోగ్యాలు కాపాడాలని వారు డిమాండ్ చేశారు ఈ మహాసభ ప్రారంభ సూచికంగా సిపిఎం పార్టీ పతాకాన్ని సిపిఎం సీనియర్ నాయకురాలు మామిడి పుల్లయ్య ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సూర్యాపేట వన్ టౌన్ లో ఈ మూడు సంవత్సరాల కాలంలోసిపిఎం పార్టీ నిర్వహించిన ప్రజా పోరాటాలనివేదికనుసిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్ ప్రవేశపెట్టారు. అంతకుముందు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సిపిఎం అఖిలభారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, మల్లు స్వరాజ్యం, బుద్ధదేవ్ భట్టాచార్య, పెన్నా అనంతరామ శర్మ, సారగుండ్ల వెంకులు, అనుములపూరి బిక్షం, సంధ్యారాణి లకు ఈ మహాసభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ మహాసభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు,మట్టి పెళ్లి సైదులు, కోట గోపి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్, జిల్లపల్లి నరసింహారావు, సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మడ్డి అంజిబాబు సిపిఎం పార్టీ పట్టణ కమిటీ సభ్యులు మామిడి సుందరయ్య, మామిడి పుల్లయ్య, అర్వపల్లి లింగయ్య,కప్పల సత్యం, షేక్ సైదులు, గండమల్ల భాగ్యమ్మ, పిట్టల రాణి, గుండెపురి శశిరేఖ,పోతురాజులక్ష్మి,షేక్ గౌస్, ఒట్టే ఎర్రయ్య, మాధగోని మల్లయ్య, ఏర్పుల శేఖర్, రావుల నాగరాజు, రాచూరి జానకిరాములు తదితరులు పాల్గొన్నారు.