. యాడి బాపు వ్యవస్థాపకులు సురేందర్ మహారాజ్, శాంతి దేవిలు పిలుపు
దీక్షతెలుగు న్యూస్, పెద్దేముల్ :
గిరిజన బంజారాల ఆరాధ్యదైవం భగవాన్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 314 జయంతి సందర్భంగా సేవాలాల్ అవతార మహోత్సవం బంజారాల ఆధ్యాత్మిక వేడుకలను పెద్దేముల్ మండలంలోని కందనెల్లి తండా యాడి బాపు ఘాట్ లో నిర్వహిస్తున్నట్లుగా దేవస్థానం వ్యవస్థాపక అధ్యక్షులు రాథోడ్ రామావత్ సురేందర్ మహారాజ్, శాంతి దేవి లు కోరారు కావున ఈ నెల 20 తేదీన జరగబోయే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మహారాష్ట్ర లోని పహరఘడ్ దేవస్తాన్ శ్రీ శ్రీ బాబు సింగ్ మహారాజ్ గారు, శ్రీ సంగ్రామ్ మహారాజ్ విట్టల్ మహారాజ్ శ్రీ దేవగిరి మహారాజ్ మరియు సాధువులు స్థానిక ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారని వారిచే ప్రత్యేక పూజ
కార్యక్రమాలు కొనసాగుతాయని అనంతరం అన్నదాన కార్యక్రమం కొనసాగుతుందని కావున ఈ కార్యక్రమానికి గిరిజన బంజారాలు మరియు రేణుక ఎల్లమ్మ, శివపార్వతుల భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు…