తాడి చెట్లు నరికిన వారిపై ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి
⏩::తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మడ్డి అంజిబాబు
మీ న్యూస్ ప్రతినిధి::సూర్యాపేట జిల్లా మోతె మండలం రాయిపహాడ్ గ్రామంలో చేలల్లో గట్టుమీద ఉన్న కల్లు అయ్యే 15 తాడి చెట్లను సండ్ర వెంకన్న అనే భూమి యజమాని నరకటం జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడంతో తాటి ఈత చెట్టును విపరీతంగా తొలగిస్తున్నారు .నరికిన వారిపై వెంటనే కఠిన చర్య తీసుకోవాలని తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం సూర్యపేట జిల్లా కార్యదర్శి మడ్డి అంజిబాబు మాట్లాడుతూ గీత కార్మికుల జీవనాధారం గీత వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తూ బ్రతుకుతున్నారు ఈ సీజన్లో ఒక్కో తాటి చెట్టు 10 నుండి 15 సీసాలు కల్లు అవుతాయి. ఇలాంటి సందర్భంలోనే తాటి చెట్లును నరికి గీతా కార్మికునికి పొట్ట కొడుతున్నారు ప్రభుత్వం ఒకపక్క చెట్లని పెంచమని చెబుతుంటే ఒకపక్క రైతులుగాని,రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు తాడి ఈత చెట్టు తొలగిస్తున్నారు. గీత కార్మికులు అడ్డుపోతే వారిని వివిధ రకాలుగా పదజాలంతో బూతులు తిడుతూ అంతటితో ఆగకుండా వారిపై దాడులు చేస్తున్నారు. ఎక్సైజ్ వాళ్లు వెంటనే
తాడి చెట్లు నరికిన వారిపై కేసు నమోదు చేసి వారికి తగిన శిక్ష వేసి గీత కార్మికుల కుటుంబానికి నష్టపారం చెల్లించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్లు గీత కార్మిక సంఘం మండల కార్యదర్శి బట్టిపల్లి నాగ మల్లయ్య సొసైటీ అధ్యక్షులు సోమగాని మల్లయ్య బాల లింగయ్య పోలంపల్లి వెంకన్న గోపగాని వెంకన్న గోపగాని రాములు సోమగాని జానకి రాములు గోదాల నారాయణ అనంతుల లింగయ్య తదితరులు పాల్గొన్నారు