Uncategorized

పాత్రికేయుడు శ్రీనివాస్ రెడ్డి తల్లి కన్నుమూత
-అనారోగ్యం చికిత్స పొందుతూ మృతి
-బుధవారం మంతటి గ్రామంలో అంత్యక్రియలు

దీక్షతెలుగు, న్యూస్ :

బషీరాబాద్ మండల ఆంధ్రప్రభ సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి తల్లి సుభద్రమ్మ రెడ్డి కొద్దిసేపటి క్రితం మరణించారు.
తాండూరు పట్టణంలోని హాస్పిటల్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం మృతి చెందారు.బషీరాబాద్ మండలం మంతటి గ్రామంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని ఆమె కుమారుడు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పాత్రికేయులు, వివిధ పార్టీ నాయకులు, బంధుమిత్రులు, ఇతరులు ఇట్టి అంత్యక్రియలో పాల్గొనగలరు.