చిలుక వాగుపై కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

Uncategorized తాండూర్ తెలంగాణ రాజాకియం వికారాబాద్

చిలుక వాగుపై కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

 

—జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ ఫిర్యాదు చేసిన బిజెపి నేతలు

 

—-హైదరాబాద్ రోడ్డు మార్గం జలాశయాన్ని తలపిస్తుంది 

 

—-తాండూర్ పట్టణo లోని 5 వార్డులు జలదిబ్బంధంలో 

 —తాండూర్ బిజెపి నాయకులు వెల్లడి 

మీ::న్యూస్ ప్రతినిధి గణేష్ 

 తాండూర్ చిలకవాగుని కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కబ్జా కొరల నుంచి తాండూరు పట్టణ ప్రజలకు విముక్తి కలగాలని చిలక వాగును సహజసిద్ధంగా ఏ విధంగా ఉండెనో అదేవిధంగా డెవలప్మెంట్ చేయాలని ఎవరైతే కబ్జా చేశారో రోడ్డును, నాలను, వాగును ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే చట్టపరమైన చర్యలు తీసుకోని కబ్జా కొరల నుంచి చిలక వాగును సహజసిద్ధంగా ఏవిధంగా ఉంది అదేవిధంగా వాగుని డెవలప్మెంట్ చేసి దాదాపుగా తాండూర్ పట్టణo లోని 5 వార్డులు జలదిబ్బంధంలో వర్షాకాలంలో చాలా ఇబ్బందిగా వార్డు లోని ప్రజలు, హైదరాబాద్ రోడ్డు కూడా దాదాపుగా జలాశయాన్ని తలపిస్తుంది కావున కబ్జాల్లో ఉన్నటువంటి నిర్మాణాలు, బిల్డింగ్లు, రియల్ ఎస్టేట్ కబ్జాదారుల నుంచి విడుదల చేసి ఎవరైతే కబ్జా చేసారో వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకొని తాండూరు పట్టణ ప్రజలకు చిలక వాగు కబ్జాల నుంచి విముక్తి కలగాలని ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజు, జిల్లా ఉపాధ్యక్షురాలు లలితక్క , జిల్లా మహిళా మోర్చా నాయకురాలు సాహు శ్రీలత, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, తాండూర్ అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్, తాండూర్ బిజెపి పట్టణ అధ్యక్షుడు నాగారం మల్లేశం, వార్డు కౌన్సిలర్లు బాలప్ప , బంటారం లావణ్య, పూజా రజనీకాంత్, తాండూరు పట్టణ ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్, పట్టణ మైనార్టీ మోర్చ అధ్యక్షులు షాబుద్దన్ తదితరులు పాల్గొన్నారు