సమాచార సంరక్షణ సమితి నూతన ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా ఎండి ఖలీల్ నియామకం
సమాచార సంరక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా జహీరాబాద్ కు చెందిన ఎండి ఖలీల్ నియమితులయ్యారు. జహీరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు బండమీది అంజయ్య శనివారం పాల్గొని నియామక పత్రం అందచేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు బండిమీద అంజయ్య మాట్లాడుతూ… సమాచార సంరక్షణ సమితి అనేది సమాచార హక్కు చట్టం అక్టోబర్ 12, 2005 నుండి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిందని,
పౌరులకున్న సమాచార హక్కుని చట్టబద్ధం చేయడం కొరకు. ప్రతి అధికార యంత్రాంగంలో జవాబుదారీతనం మరియు పారదర్శకత తీసుకురావడం కొరకు. ప్రభుత్వం వద్దనున్న సమాచారాన్ని ప్రభుత్వమే ప్రజలకు స్వచ్ఛందంగా అందించే విదంగా సమాచార హక్కు చట్టం పనిచేస్తుందన్నారు. ఉచిత విద్య, వైద్యం, ప్రతి సామాన్యుడి హక్కు అని వాటిని సాధించడమే సమాచార సంరక్షణ సమితి యొక్క ఉద్దేశం అన్నారు.ఈ కార్యక్రమంలో పి ప్రవీణ్ కుమార్,ఎండి.యాకుబ్ అలీ, అబ్జాల్ మియా తదితరులు పాల్గొన్నారు.