అంటువ్యాధులు,విష జ్వరాల

Uncategorized ఆరోగ్యం నల్లగొండ సూర్యాపేట

అంటువ్యాధులు,విష జ్వరాల

అంటువ్యాధులు,విష జ్వరాల వారి నుండి ప్రజా ఆరోగ్యాన్ని రక్షించడంలో వైద్య ఆరోగ్య శాఖ విఫలం

మీ:: న్యూస్ 

సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్

సిపిఐ (ఎం) శాఖ మహాసభలో సిపిఐ (ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవిందు విమర్శ
 సూర్యాపేట టౌన్ : అంటు వ్యాధులు, విష జ్వరాల నుండి ప్రజా ఆరోగ్యాన్ని రక్షించాలని సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఏలుగూరి గోవింద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని సీతారామపురం లో సిపిఎం నాయకులు అరవపల్లి లింగయ్య, షేక్ సైదులు అధ్యక్ష వర్గంగా వ్యవహరించిన సిపిఐ(ఎం) శాఖ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కుల గణన వెంటనే చేపట్టి స్థానిక సంస్థలకురిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు.స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల పదవీకాలం ముగిసి నాలుగు నెలలు కావస్తున్నా నేటికీ ఎన్నికలు నిర్వహించకపోవడం మూలంగా గ్రామాలలో ఎక్కడ సమస్యలు అక్కడపేరుకు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల మూలంగా నీళ్లు నిలువ ఉండటం మూలంగా ప్రతి ఇంట్లో జ్వర పీడుతులు ఉన్నారని, వారికి సరైన వైద్యం అందించడంలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పూర్తిగా విఫలం చెందారని విమర్శించారు. మురికి నీరు నిల్వ ఉండటం మూలంగా దోమలు వృద్ధి చెంది ప్రజలు చికెన్ గునియా, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా వంటి జబ్బులకు గురై అల్లాడుతున్నారనిఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పారిశుద్ధ్య నిధులు వెంటనే విడుదల చేసి దోమలు వృద్ధి చెందకుండాచూడాలన్నారు. సంచార వైద్య బృందాల ద్వారా గ్రామాలలో విస్తృతంగా పర్యటించి ప్రజలందరికీ ఉచితంగా వైద్యం అందించాలన్నారు. వైద్యంతో పాటు విస్తృతంగా టెస్టులుచేసి మందులు వారన్నారు. అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లుఇవ్వాలని కోరారు.కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ స్కీములను వెంటనే అమలు చేయాలని కోరారు. ఇటీవల వర్షాల మూలంగా కూలిపోయినఇండ్లకు, పంట పొలాలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మహాసభల ప్రారంభ సూచికంగా పార్టీ పతాకాన్ని సిపిఎం సీనియర్ నాయకులు మామిడి పుల్లయ్య ఆవిష్కరించారు.

 శాఖ కార్యదర్శిల ఎన్నిక

24వ వార్డు శాఖ కార్యదర్శిగా రావుల నాగరాజు, 25వ వార్డు శాఖ కార్యదర్శిగా మామిడి పుల్లయ్య, 26 వ వార్డు షేక్ జహంగీర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్, నాయకులులింగయ్య,నాగరాజు,సైదులు తదితరులు పాల్గొన్నారు.