కారింగుల వెంకన్న సీపీఐ(ఎం.ఎల్)మాస్ లైన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు
సూర్యాపేట మీ న్యూస్ నవంబర్ 11
రావిపహాడ్ గ్రామ పరిధిలో ఏర్పాటు అవుతున్న ఇథనాల్ ప్యాక్టరీ పనులు ఆపి తక్షణమే ఎంక్వయిరీ చేసి శాశ్వతంగా మూసివేయాలని
సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కారంగుల వెంకన్న అన్నారు ఈ రోజు మోతే మండలము హుస్సైనాబాద్ గ్రామంలో జరిగిన మాస్ లైన్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ
మోతే మండలం రావిపహాడ్ గ్రామంలో కొత్తగా నిర్మాణం అవుతున్న ఎన్ఎంకే ఇథనల్ ఫ్యాక్టరీ ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ జరుపకుండా దొడ్డిదారిలో అనుమతులు తెచ్చుకొని యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగిస్తున్నారు అన్నారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి అయి పని కొనసాగితే చుట్టూ పది కిలోమీటర్ల దూరంలో భూములు మొత్తం కాలుష్యమై ఎడారిగా మారే అవకాశం ఉంటుంది అన్నారు.అదేవిధంగా నీరు,గాలి, కాలుష్యం అయి శెట్టిగూడెం, రాయపాడు, కొటపాహాడ్, సర్వారం, బురకచర్ల ,కూడలి వీటిని అనుకోన్న తండాల ప్రజలు క్యాన్సర్,కిడ్నీ,గుండె సంబంధిత వ్యాధుల తో పాటు త్వరగా వ్యాపించే చర్మవ్యాధులు, బ్రెయిన్ ట్యూమర్ లాంటివి రెండు సంవత్సరాల తర్వాత విస్తృతంగా వ్యాపిస్తాయి అన్నారు. దీనివల్ల ప్రజలు అనేక రోగాల బారిన పడి ప్రాణాపాయ స్థితి చేరుకొని తమ విలువైన ప్రాణాలను కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం స్పందించి నిర్మాణాన్ని ఆపివేసి ఫ్యాక్టరీని రద్దు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఫ్యాక్టరీని రద్దు చేసే వరకు మా పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్,పార్టీ డివిజన్ నాయకులు పిడమర్తి లింగయ్య, చెరుకు ఎల్లయ్య,గ్రామ కార్యదర్శి గణేష్, మల్సూర్, పివైఎల్ నాయకులు శ్రీకాంత్ పాల్గొన్నారు.