విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

Uncategorized మోతే సూర్యాపేట

విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

 ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడిని నియంత్రించాలి

 పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి

సూర్యాపేట మీ న్యూస్ ప్రతినిధి జూన్ 6:-సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కి పలు సమస్యలతో కూడిన పి.డి.ఎస్.యు జిల్లా ప్రతినిధి బృందం వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) వినతిపత్రం అందించిన అనంతరం పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి పాల్గొని మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అద్వానంగా ఉన్నది. బడిబాట కార్యక్రమం మొక్కుబడిగా కొనసాగించడం కాదు, తక్షణమే ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించి విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా కార్యక్రమాలను రూపొందించాలని కోరారు. విద్యార్థులు లేరనే సాకుతో మూసివేత కు గురవుతున్న పాఠశాలలకు లోతైన పరిశీలన చేసి మూసివేత గురికాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.మరోపక్క ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిగా జిల్లా వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా వెలిశాయనీ తమ ఇష్టానుసారం ఫీజులు దండుకుంటూ అంగు ఆర్భాటాలు చూపించే విధంగా పాంప్లెట్లు పట్టుకొని గ్రామాలపై దండయాత్ర వలె అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగిస్తున్నారనీ కానీ ఉన్నత అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ఉన్నత అధికారులు ఫీజుల దోపిడిని నియంత్రించి కార్పొరేటు, ప్రైవేటు అనుమతులేని పాఠశాలలపై చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. వివిధ రకాలుగా టై, బెల్టు, బుక్స్ పేరుతో వసూలు చేస్తున్న జీరో దందాను నిలవరించాలని పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లల తల్లిదండ్రులను అధిక భారం నుండి బయటపడే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు జిల్లా నాయకులు మందడి శ్రీధర్, దూదిపాల ప్రవీణ్, ఎం.ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు