అక్రమ ఇసుక రవాణా కు అడ్డుకట్ట ఏది.? 

Uncategorized క్రైమ్ వికారాబాద్

­అక్రమ ఇసుక రవాణా కు అడ్డుకట్ట ఏది.?

 

⏩:- ప్రవేట్ వెంచర్లలో అక్రమంగా భారీ గా నిల్వఉంచిన ఇసుక 

⏩:-30నుంచి 40 ట్రాక్టర్ల భారీ డంపింగ్ ,పట్టించుకోని అధికారులు

⏩:-తాండూరు హైదరాబాద్ రోడ్డు మార్గంలో.

⏩:-ఎవరు ఏలా నిల్వ చేశారనేది తెలియని పరిస్థితి.

⏩:-వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఇది పరిస్థితి

మీ న్యూస్ ప్రతినిధి:-వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది. తాండూరులో ఇసుక మాఫియాని అడ్డుకునే నాధుడే కరువయ్యారు.దీంతో కాగ్నానది,వాగులు,వంకల నుంచి పరీవాహక ప్రాంతాల వరకు ఇసుకను తోడేస్తున్నారు.ఎలాంటి అనుమతులూ లేకుండా యథేచ్ఛగా అక్రమంగా ఇసుకను తరలిస్తూడంపింగ్ యార్డ్లను ఏర్పాటు చేసుకొని రాత్రివేళ అక్కడి నుంచి తరలిస్తున్నట్లుగా సమాచారం 

. తాండూర్ .హైదరాబాద్ రోడ్డు మార్గంలోని వైష్ణవి మోటార్స్ వెనకాల, ఓ ,ప్రైవేట్ వెంచర్లో 20 నుంచి 35 ట్రాక్టర్ ఇసుకను డంప్ చేశారు. ఇంత యదేచ్చగా నిల్వచేసిన ఇసుకను ఎవరు గుర్తించకపోవడం అధికారులు ఏం చేస్తున్నారని పలువురు విమర్శలు చేస్తున్నారు

అసలే అంతంత మాత్రంగా భూగర్భ జలాలు ఉండగా ఇసుక అక్రమ రవాణా కారణంగా భూగర్భ జలాలు మరింత అడుగంటిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. సామాన్యులు ఇళ్ల నిర్మాణాలకు ఇసుక అవసరం వస్తే సవాలక్ష నిబంధనలు చెప్పే వారు అధికారులు ఇసుక అక్రమ రవాణా దారుల విషయంలో మాత్రం నోరు మెదపకుండా చోద్యం చూస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. రాత్రి వేళల్లో తరలించే అక్రమ ఇసుక రవాణా సంబంధిత అందరు అధికారులకు తెలుసని, మామూళ్ల మత్తులో మునిగారని ప్రజలు ఆరోపింస్తున్నారు. ఇసుక బకాసురులు అధికారులు నాయకులు కుమ్మక్కై అందరూ కలిసే ఈ అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.