జై గౌడ సభ్యుల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గౌడ్ కు ఘనంగా సన్మానం
మీ న్యూస్ ప్రతినిధి::జై గౌడ ఆధ్వర్యంలో సూర్యపేట లో జిల్లా అధ్యక్షులు గుణగంటి సైదులు గౌడ్ నాయకత్వంలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గౌడ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారికి సన్మానం చేయడం జరిగింది . గౌడన్న లను ఉద్దేశించి వారు సూర్యాపేట జిల్లా గౌడ సభ్యులు ఇంతటి ఐక్యంగా ఉండడం నాకు చాలా ఆనందంగా ఉందని ఇదేవిధంగా ఒకరినొకరు పరస్పరం సహకరించుకుంటూ సర్దార్ సర్వాయి పాపన్న యొక్క ఆశయాలను మనం సాధించాలని ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకొస్తున్న వట్టికూటి రామారావు గారిని అభినందిస్తున్నానని వారు జిల్లా వాసులని జిల్లా గౌడ కుటుంబాలని వారు ప్రశంసించడం జరిగింది ఈ కార్యక్రమంలో జై గౌడ జాతీయ ఉపాధ్యక్షులు శేష గాని నరేష్ గౌడ్ జిల్లా అధ్యక్షులు గుణగంటి సైదులు గౌడ్ , తండు వెంకన్న గౌడ్ , రాపర్తి సురేష్ గౌడ్ బంటు సందీప్ గౌడ్, చమకూరి మహేందర్ గౌడ్, కీర్తి నాగరాజుగను,గుంట్ల అంజయ్యగౌడ్ గౌడ్, పవన్ గౌడ్, సాకేత్ గౌడ్,చరణ్ గౌడ్, నితిన్, గోపి తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది