స్థానిక మోతే మండల కేంద్రంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో 139వ మేడే వారోత్సవాల సందర్భంగా జెండా ఆవిష్కరణ
మీ న్యూస్ ప్రతినిధి::హుస్సేనాబాద్ గ్రామంలో ఐఎఫ్టియు అనుబంధ సంస్థ అయిన హమాలీ మిల్లు అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జెండా ఎగరవేశారు.స్థానిక మోతె మండలంలో హుస్సేనాబాద్ గ్రామంలో 139 వ మేడే వారోత్సవాలను విజయవంతంగా జరుపుకున్నారు మోతే మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ దిమ్మే పై ఎల్ ఎన్ రాజు జెండా ఎగరవేశారు హుస్సేనాబాదులో అమాలి యూనియన్ దిమ్మెపై ఆవుల ఎలమంచి జెండా ఎగరవేశారు.139వ మే డే వార్షికోత్సవాలలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు కునుకుంట్ల సైదులు పాల్గొని మాట్లాడుతూ చికాగో నగరంలో 18 గంటల పని విధానాన్ని కార్మిక వర్గం పని గంటల తగ్గింపుకై కార్మికులు అమరత్వం పొందారు నాటి నుండి నేటి వరకు కార్మిక వర్గం మేడే విప్లవ స్ఫూర్తితో ప్రపంచ కార్మికులారా ఏకంకండి అని కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పోరాటాలను కొనసాగిస్తున్నారు నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ప్రభుత్వ రంగ పరిశ్రమలను అమ్మకాన్ని ఆపాలని పనికి తగ్గ వేతనం ఇవ్వాలని అమలీలకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని 58 సంవత్సరాలు నిండిన హమాలీలకు పెన్షన్ ఇవ్వాలని మేడే మేడే వారోత్సవ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ నాయకులు కోట మధుసూదన్ రెడ్డి, సబ్ డివిజన్ నాయకులు కొమ్మ వెంకన్న, ఆవుల ఎలమంచి, ఆవుల వెంకన్న ఆవుల మల్లయ్య బొంత రాములు కొమ్ము మిన్నయ్య బొంత విజయ్ యాలాద్రి ఉపేందర్ ఆవుల మల్లయ్య ఆవుల కృష్ణ పోల్ దాస్ సైదులు కొమ్ము నరసయ్య సిహెచ్ రవి. తదితరులు పాల్గొన్నారు