శ్రీస్వామినారాయణా గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ ని సీజ్ చేయాలి

Uncategorized నల్లగొండ రాజాకియం సూర్యాపేట

శ్రీస్వామినారాయణా గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ ని సీజ్ చేయాలి

 

మీ న్యూస్ ప్రతినిది::సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి లో ఉన్నటువంటి శ్రీ స్వామి నారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ ని సీజ్ చేయాలి , ముందస్తు అడ్మిషన్ చేస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్ పర్మిషన్ను రద్దు చేయాలని పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో సూర్యాపేట చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు పూల్లూరి సింహాద్రి మాట్లాడుతూ,ఎటువంటి అనుమతులు లేకుండా అకస్మాత్తుగా జిల్లా వ్యాప్తంగా శ్రీస్వామినారాయణా గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ బోడ్ లు వెలిశాయని, పట్టణంలో, గ్రామాలలో తిరుగుతూ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని అన్నారు. అనుమతులు లేకుండా అడ్మిషన్ నిర్వహిస్తూ ఎటువంటి అకామిడేషన్ చూపించకుండా బ్రోచర్లో ఫీజులను మెన్షన్ చేయకుండా తల్లిదండ్రుల దగ్గర వాళ్ళ అమాయకత్వం ఆసరా చేసుకొని లక్ష నుంచి లక్షన్నర వరకు ఫీజు ఉందని చెప్పి ముందుగా వేల రూపాయలు కట్టి స్లాట్ బుక్ చేసుకోవాలని ప్రచారానికి దిగారని తెలిపారు. ఇంత యధేచ్చగా అడ్మిషన్లు జరుగుతున్నప్పటికీ సంబంధిత విద్యాశాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ముందస్తుగా కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల అడ్మిషన్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంబంధిత అధికారులు కనీసం తనిఖీలు చేయడం లేదన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలు ఇచ్చే మూడు పూలు తీసుకొని అనుమతులు ఇస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి అనుమతి లేకుండా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న విద్యాసంస్థలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో అధిక ఫీజులు వసూలు చేసే విద్యా సమస్యలపై ప్రత్యేక ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు నాయకులు, మహేష్,నవీన్, వినయ్, శ్రీధర్,పవన్ మహేష్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.