⏩::సిఐటియు ఆధ్వర్యంలో తహసీల్దార్ బాల శంకర్ కు వినతి పత్రం అందజేత
మీ న్యూస్ ప్రతినిధి::కోహిర్ :ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని గత మూడు సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ బాల శంకర్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ నెల 17,19,21,24 తేదీలలో ఆశ ల హక్కుల సాధన కోసం కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అన్నారు. అధికారులు ఈ నెల 17 నుండి 30 వరకు సర్వేలు చేయాలని ఆశ వర్కర్లకు ఒత్తిడి చేయడం జరుగుతుంది సిఐటి యు కోరేది ఒకటే పెండింగ్ డబ్బులు చెల్లించిన నెక్స్ట్ డే నే ఆశ వర్కర్లు కొత్త సర్వేలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. డబ్బులు వచ్చినాయి అని చెప్తున్నారు తప్ప ఆశ వర్కర్ల అకౌంట్లోకి మాత్రం డబ్బులు వేయడం లేదని అన్నారు మాటలు చెప్పడం కాదు చేతలు చేయండి అని అన్నారు దీంతోపాటు ఎగ్జామినేషన్ సెంటర్ గాని ఎలక్షన్ డ్యూటీలు కానీ చేపిస్తున్నారు కానీ డబ్బులు ఇవ్వట్లేదు ఇతర లక్షల రూపాయలు జీతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులకు మాత్రం డ్యూటీ డబ్బులు ఇస్తున్నారు ఆశ వర్కర్లు ఏం పాపం చేశారని ఇవ్వడం లేదు కాబట్టి ఇక మీదట ఎలక్షన్ డ్యూటీ గాని ఎగ్జామ్ డ్యూటీ గాని చెయ్యమని ఈరోజు ఆశ వర్కర్ల యూనియన్ తరపున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న డబ్బులు చెల్లిస్తేనే కొత్త సర్వేలు చేస్తాం లేదంటే చెయ్యమని ఆశ వర్కర్ యూనియన్ సిఐటియు తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం పూర్తిస్థాయిలో డబ్బులు చెల్లించే వరకు ఆశ వర్కర్లు అందరూ కొత్త సర్వేలు చేయవద్దని అన్నారు పెండింగ్ డబ్బులు ఇవ్వకుంటే రాబోయే రోజుల్లో ఉద్యమాలు సమ్మెలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశ యూనియన్ అధ్యక్షురాలు శివ లీల స్వరూప లక్ష్మి సునీత శారద సునీత రేణుక నాగలక్ష్మి నిర్మల సువర్ణ కల్పన అనురాధ సువర్ణ ప్రమీల నిరూప తదితరులు పాల్గొన్నారు.