మీ న్యూస్ ప్రతినిధి:: మోతేమండల కేంద్రంలోని అంగన్ వాడీ -2 సెంటర్ లో సోమవారం మండల స్థాయి పోషణ పక్షం వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదు సంవత్సరాలు పూర్తయిన చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించి ప్రోగ్రెస్ కార్డులు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమలో ఎంపీడీవో ఆంజనేయులు,డిప్యూటీ తహశీల్దార్ లావణ్య,సీడీపీవో శ్రీవాణి, ఎంపీహెచ్ఎన్ జయలక్ష్మి,సూపర్ వైజర్ జ్యోతి,ఏఎన్ఎం ఆశా, అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు, బాలితంతలు, గర్భిణులు పాల్గొన్నారు.