మునగాల: మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 16 :::: మునగాల: మునగాలమండల కేంద్రంలో విలేకరులసమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మండవ చంద్రయ్య మాట్లాడుతూ,గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో లిఫ్టుల నిర్వహణ గాలికి వదిలేసినారు చివరికి మోటార్ల సామాను పాత ఇనుముకోట్లలో అమ్ముకున్నారు లిప్టులకు సరఫరా అయ్యే కరెంటును కూడా అమ్ముకున్న పరిస్థితిఉన్నది,కాంగ్రెస్ ప్రభుత్వం భారీ నీటిపారుదల శాఖమంత్రి ఉత్తంకుమార్ రెడ్డి గారు లిఫ్టుల నిర్వహణ సమగ్రంగా సమర్థవంతంగా నిర్వహించాలని, అనేక మార్లు సమీక్షలు నిర్వహించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా రైతులపైఆర్థికభారం మోపకుండాప్రభుత్వమే,సిబ్బందిని పెట్టి ఒక పంపుఆపరేటర్ ఎలక్ట్రీషియన్,వాచ్మెన్,లస్కర్, ని ఏర్పాటుచేసి వీరికి ప్రభుత్వమే జీతాలు కల్పించిఇవ్వాలని, తీసుకున్న ప్రభుత్వ నిర్ణయం ఇందుకు రైతులను నిండా ముంచిన టిఆర్ఎస్ పార్టీ వారు సుమారుగా 20 సంవత్సరాల క్రితం లిఫ్టుల నిర్వహణ కొరకు లిఫ్టుల పారుదల క్రింద ఉన్న రైతులు ఎన్నికద్వారా చైర్మన్గా ఎన్నుకున్న పరిస్థితి ఉండే, ఇప్పుడు ఎన్నికలుజరిగిందే లేదు, చైర్మన్లు అనే వ్యవస్థ లేదు కొంతమంది మేము చైర్మన్ అని పత్రికా ప్రకటనచేయడం విడ్డూరంగాఉంది,ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవమంత్రి ఉత్తంకుమార్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ప్రభుత్వమే సిబ్బందిని నియమించడం లిఫ్టుల నిర్వహణ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతది కాబట్టి ప్రభుత్వపరంగా సిబ్బందిని ఏర్పాటుచేయడంహర్షించదగిన విషయం,ఈనిర్ణయం పట్ల గౌరవ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి గారికి కోదాడ స్థానికశాసనసభ్యురాలు శ్రీమతి ఉత్తమ్ పద్మావతిరెడ్డి గారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో,మండల కాంగ్రెస్ పార్టీనాయకులు మండవ చంద్రయ్య,జిల్లాపరిషత్ హైస్కూల్ కలకోవ మాజీవిద్యాకమిటీ చైర్మన్ పనస పెద్ద శ్రీను, సిద్దుల నాగేశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు.