పిల్లలమర్రి శివాలయం లో దైవ దర్శనం చేసుకున్న జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్
మీ న్యూస్ ప్రతినిధి::మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ కుటుంబ సమేతంగా పిల్లలమర్రి శివాలయం నందు దైవ దర్శనం చేసుకుని పూజలు నిర్వహించారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని, ఉత్సవాలను అందంగా జరుపుకోవాలని కోరారు.ఈ సందర్బంగా దేవాలయం కమిటీ వారు ఎస్పి కుటుంభానికి దేవాలయం చిత్రపట జ్ఞాపికను బహూకరించారు.అనంతరం దేవాలయం వద్ద పోలీసు బందోబస్తు పరిశీలించి భక్తుల సౌకర్యార్థం పని చేయాలని అన్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రజల రక్షణలో భగ్ గా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రముఖ శివాలయాలు, ఇతర దేవాలయాల వద్ద ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశాం అని తెలిపారు.ఎస్పి వెంట సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ బాలు నాయక్, సిబ్బంది ఉన్నారు.