ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కటిన చర్యలు.

Uncategorized క్రైమ్ తాండూర్ రాజాకియం వికారాబాద్

ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కటిన చర్యలు.

=  మైనర్ విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో ద్విచక్ర వాహనాలు నడపరాదు.

డిఎస్పీ బాలకృష్ణా రెడ్డి.

=  ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థల ప్రిన్సిపల్స్ లతో సమావేశం

=  టీజింగ్, సైబర్ నేరాలు మాదకద్రవ్యాల పైన అవగాహన కల్పించారు

 =  తాండూర్ డిఎస్పి కార్యాలయంలో ప్రత్యేక సమావేశం 

తాండూరు, మీ న్యూస్ :.ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కటిన చర్యలు తప్పవని డిఎస్పీ బాలకృష్ణా రెడ్డి పేర్కొన్నారు.గురువారం పట్టణంలో ని డిఎస్పీ కార్యాలయం లో పట్టణంలోని ప్రైవేటు మరియు ప్రభుత్వ విద్యాసంస్థల ప్రిన్సిపల్స్ లతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ట్రాఫిక్ నియమ నిబంధనలపై ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్, ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలు మరియు మాదకద్రవ్యాల పైన అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా డిఎస్పీ బాలకృష్ణా రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో మైనర్స్ డ్రైవింగ్ చేయడం ఎక్కువగా ఉందన్నారు.మైనర్స్ వాహనాలు నడిపి పట్టుబడితే వారిపైన మరియు వాహన యాజమానులపైన కూడా కేసులు నమోదు చేస్తామన్నారు.మైనర్ విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో ద్విచక్రవాహనంపై స్కూల్స్ మరియు కాలేజీలకు రాకుండా విద్యార్థులకు మరియు వారి తల్లి దండ్రులకు కౌన్సెలిగ్ నిర్వహించాలని తెలిపారు. పోలీస్ అధికారులు కూడా విద్యాసంస్థలలో వీటిపైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నరని, ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కటిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ సమావేశంలో పట్టణ సిఐ సంతోష్ కుమార్, వివిధ విద్యా సంస్థల ప్రిన్సిపల్స్ తదితరులు పాల్గొన్నారు.