ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా అలుగుబెల్లి నర్సిరెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి

Uncategorized తెలంగాణ నల్లగొండ రాజాకియం సూర్యాపేట

ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా అలుగుబెల్లి నర్సిరెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి

మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 23::ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా తనకు మరొకసారి అవకాశం ఇవ్వాలని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ టిపిటిఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం టిపిటిఎఫ్ సంఘం కార్యాలయం నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఆరేళ్ల పాటు ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం శాసనమండలి లో ప్రశ్నించి, సమస్యల పరిష్కారానికి గత బిఆర్ ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం లో ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులతో చర్చించి ఉపాధ్యాయుల పిఆర్ సి, పదోన్నతులు, ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేశానని అన్నారు. తన పదవికాలంలో ఆరేళ్ల పాటు రెగ్యులర్, కాంట్రాక్ట్ , అవుట్ సోర్సింగ్ లో విద్యా రంగంలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యల ను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి వాటి పరిష్కారం కోసం పనిచేశానని ఆయన అన్నారు. గతంలో లో కెసిఆర్ ప్రభుత్వం 7.5% పిఆర్ సి ఇస్తామంటె 30% సాధించడంలో తాను ప్రధాన పాత్ర పోషించానని అన్నారు. పాఠశాలలలో మరమ్మత్తులు, అదనపు గదుల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ఆరేళ్ల పదవి కాలంలో ప్రభుత్వం తనకు కేటాయించిన తొమ్మిది కోట్ల రూపాయలు విద్యారంగానికి కేటాయించినట్లు చెప్పారు. పాఠశాలలో పారిశుధ్య పనుల కోసం నెలకు పదివేల నుండి ఇరవై వేల రూపాయల వరకు ఇచ్చే విధంగా ప్రభుత్వాన్ని ఒప్పించినట్లు చెప్పారు. రాబోయే మేనెలలో ఉపాధ్యాయ పదోన్నతులు వుంటాయని అయన చెప్పారు. పాత పెన్షన్ విధానం అమలు చేయడానికి ఉద్యోగ సంఘాలతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో  ఆర్ రామ నరసయ్య టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు , పుప్పాల వీరన్న జిల్లా ప్రధాన కార్యదర్శి , సిహెచ్ భిక్షం రాష్ట్ర కౌన్సిలర్, కే శ్రీనివాస్, జి వెంకటేశ్వర్లు,ఎం పూర్ణచంద్రరావు , ఎన్ సోమయ్య,  ఎస్ అనిల్ కుమార్, జే యాకయ్య, పి శ్రీనివాసరెడ్డి, జి వెంకటయ్య, బి ఆడం, ఎన్ నాగేశ్వరరావు, బి రమేష్, సిహెచ్ రమేష్, కే పాండురంగ చారి, కే జ్యోతి, సిహెచ్ వీరారెడ్డి, బి పాపిరెడ్డి, ఏ జనార్దన్ రావు, సాంబయ్య, ఆర్ సీనయ్య, ఆర్ శీను, ఏ సీనయ్య, కరుణాకర్ రెడ్డి, దయాకర్ ,రాంజీ , ఆనంద్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు