సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మోహన్ సింగ్.
వికారాబాద్ :అగస్టు 29 మీ న్యూస్ ప్రతినిధి:: వికారాబాద్ జిల్లా లో ఉన్న 20 మండలాల్లో పనిచేస్తున్న సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు అందరు కూడా రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు బుధవారం శాంతి యుత నిరసన కార్యక్రమాన్ని చెపట్టి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి ఎన్టీఆర్ చౌరస్తా నుంచి కలెక్టర్ రేట్ వరకు సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల వారు నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని, తల్లితండ్రులను, మరియు కనీసం పిల్లలకైనా నాణ్యమైన విద్యను అందించడానికి
ఇబ్బందులు పడుతున్నారు. సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కేవలం 20,000 లోపల మాత్రమే ఉంటే సమగ్ర శిక్షల్లో పనిచేస్తున్న అన్ని వింగ్లవారు చిన్న నిరసన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.ఆనాటి పిసిసి అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి ఇచ్ఛిన హామీ ప్రాకారం 25 రోజుల సమ్మెలో భాగంగా
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే లేదా మేము అధికారంలో రాగానే సమగ్ర శిక్షల్లో పనిచేస్తున్న అన్ని వింగుల లేదా అన్ని విభాగాల వారి సమస్యలను మా కాంగ్రెస్ ప్రభుత్వం మా సోనియమ్మ గాంధీ మా రాహుల్ గాంధీ మా ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టంగా హామీ ఇవ్వడం అనేది జరిగింది. అదే హామీ మేరకు ఈరోజు న్యాయమైన డిమాండ్ను మేము కూడా అడుగుతున్నాము మీరు ఇచ్చిన మాటనే కదా మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయండి చాలు చాలు అని వేతనాలతో మా కుటుంబాన్ని పోషించలేని పరిస్థితుల్లో ఉన్నాము బిక్కుబిక్కుమని కడుపు మార్చుకొని అధికారుల చేతుల్లో వెట్టి చాకిరి చేసుకుంటూ పనిచేస్తున్నాము కావున తమరు మా యందు దయవుంచి అది అధికారుల చేతుల్లో వెట్టిచాకిరి చేసుకుంటూ చాలీచాలని జీతంతో పని చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం మనది మీరు ఇచ్చిన మాట కాబట్టి ఆ మాట నిలబెట్టుకోమని ఈరోజు ఎన్టీఆర్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు శాంతి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కావున గౌరవ ముఖ్యమంత్రివర్యులు వెంటనే స్పందించి సమగ్ర శిక్షల్లో పనిచేస్తున్నటువంటి అన్ని విభాగాల వారికి క్రమబద్ధీకరణ చేసే విధంగా ఒక మానవీయ కోణంలో ఆలోచన చేసి వారి కుటుంబంలో ఒక వెలుగుని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఎన్నో సంఘాల సమస్యలను సమస్యలను తీరుస్తున్నటువంటి మీరు మీ మాట గౌరవంతోనే సమగ్ర శిక్షల్లో పని చేస్తున్నటువంటి మేము కూడా ఈరోజేకైనా లేదా రేపైనా రెగ్యులరైజేషన్ ఐతమని ఒక దృఢ సంకల్పంతో అధికారుల చేతుల్లో పెట్టి జాతర చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. ఇప్పటికైనా మాపై దయవుంచి అన్ని విభాగలవారికి రెగ్యులరైజేషన్ చేసి మీరిచ్చిన మాటను నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.