=== ఇంటి నిర్మాణం చేస్తున్న వారిపై చర్య తీసుకోవాలి
=== అక్రమ ఇంటి నిర్మాణాలకు సహకరించి పర్మిషన్ ఇచ్చిన నసీర్ పంచాయతీ కార్యదర్శి పై చర్య తీసుకోవాలని
=== సిపిఎం ప్రజాసంఘాలు డిమాండ్
మీ న్యూస్ ప్రతినిధి:::బషీరాబాద్ మండల కేంద్రంలో గొట్టిగ కలాన్ గ్రామంలో ప్రభుత్వం భూమి సర్వే నెంబర్ 1/2. 5 గుంటల ప్రభుత్వ పాఠశాల ఆవరణకు సంబంధించిన భూమిలో చింత చెట్లు నరికేసి ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకుని ఇంటి నిర్మాణం చేస్తున్న వారికి అక్రమంగా పంచాయతీ పరిమిషన్ ఇచ్చిన సహాకరించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి నసీర్ పై భూమి కబ్జా చేసి ఇంటి నిర్మాణాలు చేసుకొని ప్రభుత్వ భూమిని ఇతరులకు అమ్ముకున్న నీలి సందప్ప పైన ప్రభుత్వ పాఠశాల భూమి కబ్జా చేసుకోని ఇంటి నిర్మాణం చెసి నిర్మల లక్ష్మమ్మ పై చర్య తీసుకొని ప్రభుత్వ భూమిని రక్షించాలని డిమాండ్ చేశారు ఆక్రమ నిర్మాణలు తొలగించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ భూములను రచించవలసినటువంటి రెవిన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్లనే గ్రామంలో ప్రభుత్వ భూములు అన్ని అన్యాక్రాంతమయితున్నాయని ప్రభుత్వ భూములను కబ్జా ఇతరుల అమ్మిన వారిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు సిపిఎం ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ గతంలో అనేక సార్లు కబ్జాలు గురి అవుతున్నాయి అని అన్నారు వాటిని ప్రభుత్వ భూములను రక్షించడంలో పూర్తిగా వైఫల్యం అవుతున్న మండల అధికారులు రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో చెట్లు నరికి వేసిన పట్టించుకోకుండా తూతూ మంత్రంగా విచారణ చేసి చెట్లు నరికిన నీలి సందప్ప అనంతప్పలపై చర్య తీసుకోవాలని ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసిన నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రభుత్వ భూములను రక్షించాలని చింత చెట్ల నరికివేత వారి పై చర్య తీసుకోవాలని డిమాండ్ లేకపోతే పెద్ద ఎత్తున బషీరాబాద్ మండల ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. తాండూర్ సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీనివాస్ బి చంద్రయ్య ప్రజాసంఘాల నాయకులు ఎస్సీ ఎస్టీ మైనార్టీ హక్కుల పోరాట సంఘం అధ్యక్షులు కే చంద్రయ్య సతీష్ బాబు పాల్గొన్నారు