పేటలో BRSV గురుకుల బాట

Uncategorized నల్లగొండ రాజాకియం సూర్యాపేట

 

పేటలో BRSV గురుకుల బాట

ప్రభుత్వ హాస్టళ్ళను సందర్శించిన BRSV రాష్ట్ర బృందం

విద్యార్థులతో మాట్లాడుతూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ

మేమున్నామంటూ గురుకుల విద్యార్థులకు భరోసా కలిపిస్తున్న BRSV బృందం

 

మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 2:+

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆదేశాల మేరకు BRSV రాష్ట్ర పిలుపుతో సూర్యాపేట లో పలు ప్రభుత్వ హాస్టళ్ళను సందర్శించిన BRS విద్యార్ధి సంఘం నాయకులు. ఈ సందర్బంగా BRSV రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శిగ వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో పలు హాస్టళ్ళను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ గురుకులాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పోరాడి సాధించిన తెలంగాణలో అన్ని రంగాల అభివృద్ధితో పాటు ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేసిన ఘనత కెసిఆర్ కు దక్కుతుందన్నారు. వందలాది గురుకుల పాఠశాలలను స్థాపించి ఎంతో మంది విద్యార్థులకు ఉన్నత విద్యా విలువలు అందించారన్నారు. అటువంటి గురుకుల పాఠశాలలను కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి బ్రష్టు పట్టించారన్నారు. సరైన పోషకాహారాలు అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని గురుకుల విద్యార్థులు అంటేనే రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు BRS విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గురుకుల బాట చేపట్టామని దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని గురుకులాలను సందర్శిస్తున్నట్లు తెలిపారు. అయితే గురుకులాలను బిఆర్ఎస్ విద్యార్థి విభాగం సందర్శిస్తున్న విషయాన్ని తెలుసుకొని కొన్నిచోట్ల కాంగ్రెస్ శ్రేణులు హాస్టలను సందర్శించి వారితో కలిసి భోజనం చేస్తున్న ఘటనలు చూస్తున్నామన్నారు. కాంగ్రెస్ నాయకులు వచ్చినప్పుడు తమతో కలిసి భోజనం చేసినప్పుడు వడ్డించిన ఆహార పదార్థాలని ప్రతిరోజూ తమకు వడ్డిస్తే బాగుంటుందని విద్యార్థులు పలుచోట్ల తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. కాంగ్రెస్ నాయకులు హాస్టలను సందర్శించడం బాగానే ఉందని.. అయితే అక్కడ ఉన్నటువంటి అసౌకర్యాలను, విద్యార్థులకు కావలసిన అవసరాలను తీర్చే విధంగా కాంగ్రెస్ శ్రేణులు ప్రత్యేక చొరవ తీసుకుంటే బాగుంటుందని సూచించారు. రేవంత్ రెడ్డి ఇకనైనా మేలుకొని ప్రభుత్వ గురుకుల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, రాష్ట్ర విద్యార్ధి నాయకులు రాపోలు నవీన్ కుమార్, నెమ్మది శ్రవణ్ కుమార్, బానోత్ సురేష్ నాయక్, గుండాల సందీప్, పల్లెపంగు నాగరాజు, రామావత్ అశోక్ నాయక్, వడ్డేపల్లి సందీప్, వేల్పుకొండ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.