కుక్క కాటుకు బలవుతున్న గ్రామ ప్రజలు 

నల్లగొండ మోతే సూర్యాపేట

కుక్క కాటుకు బలవుతున్న గ్రామ ప్రజలు 

 

 ⏩::చిన్న పెద్ద లేకున్నా రోజు దాడులు చేసిన వీధి కుక్కలు 

 

 ⏩::ఆందోళన గురవుతున్న గ్రామ ప్రజలు 

 

 ⏩::కుక్కల బెడద నుండి కాపాడాలని స్థానిక నాయకులు కోరుతున్న గ్రామ ప్రజలు 

 

⏩::మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ 9640659560

మీ న్యూస్ ప్రతినిధి మార్చి 14::మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్ నందు కుక్కల బెడద రోజురోజుకు  ఎక్కువ కావడంతో ప్రజల ఆందోళన రాఘవపురం ఎక్స్ రోడ్డు గ్రామానికి చెందిన రాచకొండ ఎల్లమ్మ ఉదయం ఇంటి ముందల ముగ్గు వేయుచుండగా ఒక్కసారి కుక్కలు ఎల్లమ్మ దగ్గరకు వచ్చి కాటు వేయడం జరిగినది, ఏం చేయాలో పరిస్థితి ఉన్న ఎల్లమ్మను అక్కడ ఉన్న ప్రజలు కుక్క కాటు నుండి  ఎల్లమ్మను రక్షించారు. గ్రామంలో రోజురోజుకు  చిన్న పెద్ద తేడా లేకుండా కుక్కలు కాటు వేయడంతో ప్రజలు త్రీవ ఆందోళన గురవుతున్నారు. తక్షణమే ఈ కుక్కల బెడద నుండి గ్రామ ప్రజలని కాపాడాలని కోరుకుంటున్నారు.