అసంపూర్తిగా ఉన్న అంగన్వాడి భవనాలు పూర్తి చేయాలి

Uncategorized మోతే రాజాకియం సూర్యాపేట

అసంపూర్తిగా ఉన్న అంగన్వాడి భవనాలు పూర్తి చేయాలి

 

⏩::క్రీడా ప్రాంగణంలో క్రీడా సామాగ్రి ఏర్పాటు చేయాలి

 

 ⏩::సిపిఎం ప్రజా పోరు యాత్రను ప్రారంభించిన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు

 

మీ న్యూస్ మార్చి 11::మోతే : మోతే మండల వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న15 అంగన్వాడి భవనాలకు బడ్జెట్ కేటాయించి పూర్తిచేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మోతే మండలం రాఘవాపురం గ్రామంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ప్రజా పోరు యాత్రను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ 2018 సంవత్సరంలో మోతే మండలంలోని12 గ్రామాలలో 15 అంగన్వాడి కేంద్రాలకు నూతన భవనాలు మంజూరు అయ్యాయని అన్నారు. భవనాలు మంజూరు అయి సుమారు40 శాతం పనులు అయినప్పటికీ బిల్లులు రాని కారణంగా కాంట్రాక్టర్ పనులను మధ్యలోనే వదిలి వేశారని అన్నారు. భవన పనులు చేపటకపోవడంతో అసంపూర్తిగా నిర్మించిన అంగన్వాడి భవనాలు శిథిలావస్థలోకి చేరుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే అసంపూర్తిగా నిర్మాణం చేసి ఉన్న అంగన్వాడి భవనాలకు నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాఘవాపురం గ్రామంలో క్రీడా ప్రాంగణంలో ఎలాంటి క్రీడా వస్తువులు ఏర్పాటు చేయకుండా అసంపూర్తిగా వదిలివేశారని అన్నారు. క్రీడా ప్రాంగణంలో క్రీడా వస్తువులు ఏర్పాటు చేయకుండా అక్రమంగా బిల్లులు తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని విద్యార్థులకు, యువకులకు క్రీడ వస్తువులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యలను పరిష్కరించాలని లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కిన్నెర పోతయ్య, కక్కిరేణి సత్యనారాయణ, భగత్ సింగ్ యువజన సంఘం ఉపాధ్యక్షులు కొమ్ము క్రాంతికుమార్, సిఐటియు మండల నాయకులు ఒగ్గు సైదులు, గ్రామస్తులు పద్మ, నాగలక్ష్మి పాల్గొన్నారు.