ఐఏఎల్ రాష్ట్ర అధ్యక్షులుగా బొమ్మగాని ప్రభాకర్

Uncategorized నల్లగొండ మోతే రాజాకియం సూర్యాపేట

ఐఏఎల్ రాష్ట్ర అధ్యక్షులుగా బొమ్మగాని ప్రభాకర్

హర్షం వ్యక్తం చేసిన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొమ్మగాని శ్రీనివాస్, తొగిటి మురళి

మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 2::తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఐ ఏ ఎల్ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నిక పట్ల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొమ్మగాని శ్రీనివాస్, తొగిటి మురళి మరియు జిల్లా కమిటీ పక్షాన వారు హర్ష వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవంబర్ 30, డిసెంబర్ 1 తారీకు వరంగల్ లో జరిగిన ఐఏఎల్ తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ రెండవ రాష్ట్ర మహాసభల్లో ఆయనను రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకున్నట్లు వారు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల రక్షణ కోసం ఐఏఎల్ పోరాటం చేస్తుందని రాష్ట్రంలో న్యాయవాదుల సంక్షేమం వారి హక్కుల పరిరక్షణ కోసం ఐఎల్ కృషి చేస్తుందని, న్యాయవాదులపై జరుగుతున్న దాడులను వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు నూతన చట్టాలపై అవగాహన రాష్ట్ర మహాసభలో తీర్మానం రూపొందించినట్లు వారు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన ప్రభాకర్ గారికి జిల్లా గౌరవ అధ్యక్షులు నాతి సవిoదర్ కుమార్, గుడిపూడి వెంకటేశ్వర్లు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి సత్యనారాయణ, ఎరగాని వెంకటేశ్వర్లు, జి రాజారాం, దోరేపల్లి రమేష్, బి.వీ.ఎం. సుధీర్, కంచర్ల సతీష్, బానోతు సతీష్ , ప్రతాప్, వి. వెంకటేశ్వరరావు, మహిళ న్యాయవాదులు పెండం వాణి, శశిరేఖ, సరిత రెండవ మహా సభలో పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు.