కెసిఆర్ కు పేరు వస్తుందని దుర్బుద్ధితోనే నీళ్లు ఇవ్వడం లేదు

Uncategorized నల్లగొండ రాజాకియం సూర్యాపేట

కెసిఆర్ కు పేరు వస్తుందని దుర్బుద్ధితోనే నీళ్లు ఇవ్వడం లేదు

 

 

మీ న్యూస్ మార్చి 11::కాలేశ్వరం ఒక పిల్లర్ కూలితే దాని రిపేరు చేయించి రైతులకు నీళ్లు ఇవ్వాల్సి ఉండగా బాగు చేయిస్తే కెసిఆర్ కు ఎక్కడ పేరు వస్తుందోనని దుర్బద్ధతితోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీళ్లు ఇవ్వకుండా రైతుల పంట పొలాలను ఎండబెడుతున్నాడని మాజీ రాజ్యసభ సభ్యులు, సూర్యాపేట జిల్లా బి.ఆర్.ఎస్ అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా బిఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో అన్ని వర్గాలు కుదేలయ్యాయని ముఖ్యంగా వ్యవసాయం పూర్తిగా నష్టాల్లో ఉందన్నారు.రాష్ట్రంలో నీళ్లు లేక లక్షల ఎకరాలు ఎండిపోతున్నాయని ఉమ్మడి జిల్లాలో ఎస్సారెస్పీ కింద తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లో పంటలు పండక పశువులను మేపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తో పాటు మాజీ ఎమ్మెల్యేలు రైతుల పంట పొలాలను సందర్శించారని అలాగే జిల్లా పార్టీ పక్షాన పంట నష్టపరిహారాన్ని అంచనావేసి వెంటనే పరిహారం అందజేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కరెంటు విషయానికి వస్తే వచ్చేది పోయేది తెలవడం లేదని రైతులకు ఎరువుల కొరత తీవ్రంగా ఉందన్నారు. రాష్ట్రంలో రైతు భరోసా మూడు వేల పది కోట్లు ఇవ్వాల్సి ఉండగా 1800 కోట్లు ఇచ్చి ఎగనామం పెట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు 1,52,000 కోట్ల అప్పు చేసిందని నిర్దిష్టంగా దేనికి ఖర్చు చేసింది చెప్పలేదని, నాడు కేసీఆర్ అప్పు చేస్తే అభివృద్ధి కార్యక్రమాలు చేశాడని దానిపై రాబడి సృష్టించాడన్నారు. రేవంత్ రెడ్డి అప్పుచేసి కాంట్రాక్టర్లకు ఇచ్చాడు తప్ప ప్రజల కోసం ఏమి చేయలేదని 2014కు ముందు ఉన్న పరిస్థితి ఇప్పుడు పునరావృతం అవుతుందన్నారు. మళ్లీ కెసిఆర్ వస్తేనే మంచి రోజులు వస్తాయని ప్రజలు భావిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులు యువత ఉద్యోగులు ఎవరు సంతోషంగా లేరన్నారు. అధికారంలో వచ్చే ముందు ఆరు గ్యారెంటీలని ప్రగల్బాలు పలికి ఇచ్చిన ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారన్నారు. బి ఆర్ ఎస్ కు అధికారం ముఖ్యం కాదని పదేళ్లు ప్రజలు అధికారం ఇస్తే కెసిఆర్ దేశానికి ఆదర్శంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దారని అలాంటి పాలనకు ప్రజలు దూరం అయ్యారన్నారు. గురుకులాల్లో నేటి వరకు 45 మంది విద్యార్థులు చనిపోయారని 456 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాదిన్నర కాలం కేసీఆర్ సమయం ఇచ్చారని ఇప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రజా సమస్యలపై నిలదీసేందుకు అసెంబ్లీకి వస్తాననడం పట్ల ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు నీళ్లు ఇవ్వాలని, లేని పక్షంలో పంట నష్టపరిహారాన్ని అంచనా వేసి ఎకరానికి 30 వేలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉద్యమించేందుకు జిల్లా పార్టీ తరఫున త్వరలో కార్యచరణ రూపొందిస్తామన్నారు. ఈ సమావేశంలో మాజీ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మాజీ జడ్పిటిసి జిడి బిక్షం, ఆత్మకూర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తూడి నరసింహారావు, జిల్లా బి.ఆర్.ఎస్ నాయకులు ఆకుల లవకుశ తదితరులు ఉన్నారు.