ప్రజావాణి వచ్చిన దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి

Uncategorized నల్లగొండ సూర్యాపేట

ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి

⏩::వేసవిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

⏩::ప్రజావాణి కి 73 దరఖాస్తులు.జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్

 

మీ న్యూస్  మార్చి 10::ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యమిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ అధికారులకు సూచించారు.సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమానికి 73 ఫిర్యాదులు అందజేశారు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ పి రాంబాబుకు తెలిపారు.ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించే విధంగా ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ తెలిపారు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి అనంతరం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా ట్రాన్స్పోర్ట్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ తీవ్రమైన వడదెబ్బకు ప్రజల గురి కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆరోగ్యశాఖ సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు.ఎండాకాలంలో తీవ్ర ఉష్ణోగ్రతల పెరిగే అవకాశం ఉన్నందున ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అత్యవసరం అయితేనే తప్ప బయటకు రాకూడదని ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు బయటకు వెళ్లకూడదని కలెక్టర్ సూచించారు గర్భిణీ స్త్రీలు మరియు చిన్న పిల్లలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశాలలో కూలీలకు షేడ్ నేట్స్ ఏర్పాటు చేయాలని, త్రాగునీటి సౌకర్యం అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా సిద్ధంగా ఉంచాలని తెలిపారు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో తగినన్ని మందులు ఓఆర్ఎస్ పాకెట్స్ అందుబాటులో ఉండాలని కలెక్టర్ తెలిపారు జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని పాఠశాలలో హాస్టల్స్ లో( ఫ్యాన్) గాలి పంకా లు వాడుకోనెలా సిద్ధం చేయాలన్నారు మహిళా ఉద్యోగులు క్యాప్స్ మరియు గొడుగులు తప్పక వాడాలన్నారు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు త్రాగునీటి ఎద్దడి రాకుండా ఎల్లప్పుడూ పరిశీలిస్తూ చిన్నచిన్న మరమ్మత్తులను వెంటనే పూర్తి చేయాలని ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలవకుండా చూడాలని కలెక్టర్ తెలిపారు అనంతరం వైద్య ఆరోగ్యశాఖ అధికారులు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆరోగ్యం పై వేడి ప్రమాదం వేడి సంబంధిత అనారోగ్యాలు గోడ పత్రికలను మరియు పాంప్లెట్లను ఆవిష్కరించారు అనంతరం తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా శాఖ సభ్యులు తల్లిదండ్రుల వయోధికుల పోషణ మరియు సంక్షేమ చట్టం 2007 నియమావళి2011 తెలిపే గోడపత్రికలను కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో వివి అప్పారావు, డీఎఫ్ సతీష్ కుమార్, సి పి ఓ ఎల్ కిషన్, డిఎంహెచ్వో కోటాచలం, డిఈఓ అశోక్ ,డి టి డి ఓ శంకర్, ఎస్సీ అభివృద్ధి అధికారి లత, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, మైనార్టీ అధికారి జగదీశ్ రెడ్డి, పి డి ఎస్ సి కార్పొరేషన్ శ్రీనివాస్ నాయక్ ,జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా పరిశ్రమల అధికారి సీతారాం నాయక్, డిఎస్ఓ రాజేశ్వరరావు, డి సి ఓ శ్రీనివాస్, కలెక్టరేట్ ఏవో సుదర్శన్ రెడ్డి, మెప్మా పీడీ రేణుక జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు