సూర్యాపేట జిల్లా మునగాల మండల ప్రజలు నైట్ హెచ్ బీ దొంగల గ్యాంగ్ తో అప్రమత్తంగా ఉండాలని మునగాల ఎస్ఐ బి. ప్రవీణ్ కుమార్ అన్నారు. మధ్యప్రదేశ్ స్టేట్ బీల్ ఏరియా 6 చెందిన నైట్ హెచ్ బీ గ్యాంగ్ మన జిల్లాలో గత రెండు మూడు రోజుల నుండి హల్ చల్ చేస్తున్నారని సమాచారం. గత రాత్రి సూర్యాపేటలో అఫెన్స్ చేశారు. కానీ ప్రాపర్టీ ఏమి దొరకలేదు. ఈరోజు అదే గ్యాంగ్ మన ఏరియాని టార్గెట్ చేసుకోవచ్చు. ఈ గ్యాంగ్ ఎక్కువగా శివారు ప్రాంతాల్లో ఐసోలేటెడ్ ఇండ్లలో అర్థరాత్రి ఒంటి గంట నుండి తెల్లవారుజామున నాలుగు గంటల మధ్యన అఫెన్స్ చేస్తారు. అండర్ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్స్, ఇండ్లు మొదలగు వాటిలో షెల్టర్ తీసుకుంటారు. వీరి కాళ్ళ సింగల్ స్ట్రిప్ శాండిల్ మాదిరి చెప్పులు ఉంటాయి. తెలుగు మాట్లాడలేరు.. జిల్లా శివారులోని ప్రజలు ఆప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే పోలీసు వారికి తెలియపరచవలసిందిగా కోరారు. వీరు ప్రాణాలు తీయడానికైనా వెనకాడరని సమాచారం. మీ ఏరియాలో ఈ గ్యాంగ్ ఎటువంటి నేరాలు చేయకుండా చూసుకోవాలని మండల ప్రజలను కోరారు..