తాండూరు అగస్టు (27 మీ న్యూస్ ప్రతినిధి ) పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు పట్టణ సిఐ జి సంతోష్ కుమార్ తెలిపారు.సోమవారం రాత్రి 09:30 గంటల సమయంలో నమ్మదగిన సమాచారం మేరకు తాండూర్ పట్టణంలోని హిమాలయ లాడ్జ్ రూం నెం106లో పేకాట అడుతున్న ఆరుగురు వ్యక్తులు ఎస్.రాజు, ప్రసాద్, అంజయ్య, కే. రాజు, ఆర్.రాజు రవీందర్ రెడ్డి విరందరి నివాసం చెనిగేష్ పూర్. అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి పేక ముక్కలు, 6 సెల్ ఫోన్స్, 4 మోటార్ సైకిల్స్ మరియు 21420 రూపాయలు స్వాధీనం చేసుకొని కేసునమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పట్టణ సిఐ సంతోష్ కుమార్ తెలిపారు.