ముఖ్య అతిధిగా పాల్గొన్న వార్డు కౌన్సిలర్ గండూరి పావని క్ర్రపాకర్ దంపతులు
చిన్ని కృష్ణుడు, గోపికల వేషధారణలో పాల్గొన్న చిన్నారులు
మీ న్యూస్ సూర్య ప్రతినిధి పేట్ కోల రవీందర్ గౌడ్
శ్రీ కృష్ణుని జన్మదినం కృష్ణాష్టమి సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్ 45 వ వార్డు విద్యానగర్ నందు గల గండూరి జానకమ్మ వాటర్ ప్లాంట్ వద్ద అంగన్ వాడి కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన కృష్ణాష్టమి వేడుకలలో ముఖ్య అతిధిగా వార్డు కౌన్సిలర్ గండూరి పావని క్ర్రపాకర్ దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిన్ని కృష్ణుడు, గోపికల వేషధారణలో చిన్నారులు అలరించి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ఉట్టి కొట్టారు. పరుగుపందెంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గండూరి పావని క్ర్రపాకర్ లు మాట్లాడుతూ శ్రీ కృష్ణుని జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారని, అత్యంత ఆనందోత్సాహాలతో విదేశాలలో, దేశవ్యాప్తంగా క్ర్రష్ణాష్టమి వేడుకలను జరుపుకుంటారని అన్నారు. శ్రీ కృష్ణుని బాల్యమంతా స్నేహితుల.మధ్య బృందావనంలో ఆటపాటలతో గడిపాడరని, శ్రీ కృష్ణుడు భోధించిన భగవద్గీత మానవాళికి మార్గదర్శకమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు కౌన్సిలర్ గండూరి పావని క్ర్రపాకర్ దంపతులు బహుమతులను అందించి ఆశీర్వదించి, స్వీట్లు, బిస్కట్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడీ టీచర్.మల్లీశ్వరి,ఉమామహేశ్వరి, సంధ్య, నవనీత, జ్యోతి, దివ్య, మ్ర్రధుల, పద్మ, కుక్కడపు భిక్షం, సందీప్, ఇస్మాయిల్, అనిల్ , మహేష్ తదితరులు పాల్గొన్నారు.