సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ 9640659560 మునగాల: జాతీయ రహదారి విస్తరణలో భాగంగా మునగాల, బరాకత గూడెం గ్రామాల్లో ఏర్పాటుచేసిన సర్వీసు రోడ్లపై కుప్పలు తిప్పలుగా ఉన్న మట్టి దిబ్బలను తీసివేయాలని సామాజిక సేవా కార్యకర్త గంధం సైదులు సంబంధిత ఆఫీసర్లను శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. గత సంవత్సర కాలం నుంచి సర్వీస్ రోడ్డుపై ఉన్న మట్టిని, చెత్తను తొలగించకపోవడం వల్ల వాహనాలు పోయే సమయంలో తీవ్రమైన దుమ్ము రావడంతో రోడ్డు పక్కన ఉన్న ఇంటి యజమానులు, షాపుల యజమానులు, రహదారిపై వెళ్లే వాహనదారులు సైతం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఫలితంగా శాశ్వత్కోశ వ్యాధులతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.