యాడి బాపూ గడ్ దేవస్థానం ఫౌండర్ ట్రస్టీలు మోటర్ పంప్ సెట్ ను ప్రారంభం 

Uncategorized తాండూర్ పేద్దేమూల్ రాజాకియం వికారాబాద్

యాడి బాపూ గడ్ దేవస్థానం ఫౌండర్ ట్రస్టీలు మోటర్ పంప్ సెట్ ను ప్రారంభం 

⏩::మాట నిలబెట్టుకున్న మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విటల్ నాయక్

⏩::కృతజ్ఞతలు తెలిపిన యడి బాపూ గడ్ దేవస్థానం ఫౌండర్ ట్రస్టీలు

 

మీ న్యూస్ ప్రతినిధి::వికారాబాద్ జిల్లా పెద్దేములు మండల పరిధిలోని కందనెల్లి తండా యాడి బాపు గడ్ దేవస్థానం ఆధ్యాత్మిక కేంద్రంలో ఈ నెల 20వ తేదీన సద్గురు సంత సేవాలాల్ జయంతి ఉత్సవాలకు తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇక్కడికి విచ్చేసే భక్తులకు త్రాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని త్రాగునీటి సమస్య తీర్చేందుకు గాను తన వంతు సహాయంగా తాగునీటి కోసం లక్ష 14 వేల రూపాయలు విరాళంగా ఇస్తున్నానని మాట ఇచ్చారు. విట్టల్ నాయక్ ఇచ్చిన మాట ప్రకారం 21 తేదీన బోరు వేయించి మోటర్ పంప్ సెట్ ను బిగించారు. నేడు ఆలయ ప్రాంగణంలో దేవస్థానం ఆధ్యాత్మిక కేంద్రం ఫౌండర్ ట్రస్టీలు శ్రీ సురేందర్ నాయక్ మహారాజ్, శాంత దేవిల తో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి త్రాగునీటి సౌకర్యాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా విట్టల్ నాయక్ మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసి భక్తులకు త్రాగునీటి అవసరం తీర్చేందుకుగాను బోరు మోటారు వేయించడం జరిగిందని రానున్న రోజుల్లో ఆలయ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు.. దేవస్థానం ఫౌండర్ ట్రస్టీలు సురేందర్ నాయక్ మహారాజ్ శాంతి దేవీలు మాట్లాడుతూ భక్తులకు త్రాగునీటి సౌకర్యం కల్పించిన విటల్ నాయక్ కు ముందుగా కృతజ్ఞతలు అని ఆయన మేలు జీవితంలో మరిచిపోమని ఆ దేవదేవుడు పరమేశ్వరుడు ఆయురారోగ్యాలు కల్పించి ఉన్నత పదవులు అధిరోహించి పేదలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తూ ఆయనకు ఘనంగా సన్మానం చేశారు.రానున్న రోజుల్లో ఇక్కడి ప్రాంతం పుణ్యక్షేత్రంగా మారనుందని దాదాపు రెండు కోట్ల రూపాయలతో శివాలయం సేవాలయం శ్రీ మావురాల ఎల్లమ్మ దేవాలయం ఆగమ శాస్త్ర ప్రకారం నిర్మిస్తామని అన్నారు.. అందుకుగాను భక్తులు స్వచ్ఛందంగా విరాళాలు అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు గిరిజన నాయకులు స్థానికులు పాల్గొన్నారు