జాతీయ సైన్స్ దినోత్సవం.. విద్యార్థిని విద్యార్థులు అవగాహన

Uncategorized సూర్యాపేట

జాతీయ సైన్స్ దినోత్సవం.. విద్యార్థిని విద్యార్థులు అవగాహన

 

మీ న్యూస్ ప్రతినిధి::పెంపొదించుకోవాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు,మోతె మండల నోడల్ అధికారి,బి. ఎల్. ఎన్. చారీ అన్నారు.శుక్రవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడారు.ఈ సందర్బంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్స్పర్మెంట్స్ ను ప్రారంభించారు. విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన, వకృత్వం, ముగ్గుల పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం చేశారు.పర్యావరణం పై అవగాహన కల్పించుటకు గాను గ్రీన్ ట్రస్ట్ క్లబ్ మెంబర్ సోమ సురేష్, గ్రీన్ ట్రస్ట్ క్లబ్ సూర్యాపేట వారిని పాఠశాలకు ఆహ్వానించడం జరిగింది.ఈ సందర్బంగా పర్యావరణ పరిరక్షణపై అధ్యక్షుడు ముప్పారపు నరేందర్ మాట్లాడుతూ గాలి,నీరు, భూమి, కలుషితం కాకుండా ప్రతి విద్యార్థి, ప్రతి కుటుంబం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్ధాలను వివరించారు. ప్రతిఒక్కరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు చేతి సంచి ఉపయోగించి,ప్లాస్టిక్ కవర్లను తిరస్కరించాలని అన్నారు. స్టీల్ వస్తువులను ఉపయోగించడం ద్వారా ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని రక్షించినట్లు అవుతుందన్నారు. పుట్టినరోజులు సందర్భంగా మొక్కల్ని నాటడం ఇతరులకు అవగాహన కల్పించడం తప్పనిసరి బాధ్యతగా భావించాలని వివరించారు. ఈ సందర్బంగా గ్రీన్ క్లబ్ ట్రస్ట్ సూర్యాపేట ఆధ్వర్యంలో పాఠశాలలోని విద్యార్థులందరికి క్లాత్ తో తయారుచేసిన చేతి సంచులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సోమ సురేష్, ఎలిపెద్ది సుధాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రాంరెడ్డి, రాజేశ్వరి,రహేలా కుమారి, కృష్ణయ్య, సుదీర్ కుమార్, మురళి, కోటేశ్వరరావు,గ్రీన్ ట్రస్ట్ క్లబ్ సభ్యులు రామచంద్రయ్య, సంపత్,విద్యార్థులు పాల్గొన్నారు.