మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 20:::: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను పార్లమెంటులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంబేద్కర్ గారిని చులకన చేస్తూ, హేళన చేస్తూ అనుచిత వాక్యాలు చేయడంపై నిరసిస్తూ శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో రైతు బజార్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేశారు.
అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని, అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు, న్యాయవాది తల్లమల్ల హసేన్, మాల మహానాడు జిల్లా గౌరవ అధ్యక్షులు బోలెదు దశరథ డిమాండ్ చేశారు.
ఈ యొక్క కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా నాయకులు వీర్జల వేణు బలరాం, కట్ల మురళి, బొల్లెద్దు వినయ్, అసొద రవి , బోయిల్ అఖిల్, సమతా సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షులు అనుములపూరీ రామకృష్ణ , సైదులు, జంగా కరుణాకర్ చెవుల నాగరాజు, భద్రాచలం బోయిన్ల నరేందర్ , గోనె సాగర్ బోయిన రవి , మాల మహానాడు ,పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ, అంబేద్కర్ యువజన సంఘాలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు