మంచి ప్రోటీన్ తో ఉన్న భోజనాన్ని విద్యార్థులకు కందించాలి

Uncategorized నల్లగొండ మునుగాల సూర్యాపేట

మంచి ప్రోటీన్ తో ఉన్న భోజనాన్ని విద్యార్థులకు కందించాలి

 ⏩::పాఠశాల పరిశీలించిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు

మీ న్యూస్ ప్రతినిధి:: సూర్యాపేట జిల్లా మునగాల ప్రభుత్వపాఠశాలలో విద్యార్థులకు అందించే మాధ్యాహ్న భోజనాన్ని సుచి శుభ్రతతో తయారు చేయాలని మునగాల ప్రాథమిక వైద్య శాల డాక్టర్ రవీందర్ అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని స్థానిక ఎంఈఓ పిడతల వెంకటేశ్వర్లతో కలిసి వారు ప్రత్యక్షంగా పరిశీలించారు. జిల్లాకలెక్టర్ ఆదేశాను సారం మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు అందించే పౌష్టిక ఆహారాన్ని తాము ప్రత్యక్షం గా తిని పరిశీలన చేస్తున్నామని డాక్టర్ రవీందర్ తెలిపారు. ఆహార పదార్థాలు తయారు చేసిన స్వచ్ఛమైన తాగునీటిని వాడాలని, తాగునీటితో బియ్యం కూరగాయలను రెండు సార్లు పరిశుభ్రంగా కడగాలని అన్నారు. అదేవిధంగా ఆహార పదార్థాలు తయారు చే యడానికి ముందు తయారుచేసిన తర్వాత తప్పకుండా మూతలు ఉంచాలని తెలిపారు. ఆహార పదార్థాలు వండేటప్పుడు చుట్టుపక్కల ఈగలు దోమలు పురుగులు లేకుండా పరిశుభ్రమైన వాతావరణం ఉండేటట్లు చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా భోజనాన్ని స్వయంగా తిని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు,