పురపాలక సంఘం ఆధ్వర్యంలో పనులు భేష్.

Uncategorized జాతర తెలంగాణ నల్లగొండ సూర్యాపేట

పురపాలక సంఘం ఆధ్వర్యంలో పనులు భేష్.

⏩::జిల్లా కలెక్టర్ దిశానిర్దేశ్యంతో పనులు మరింత వేగవంతం.

 

 

మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 18::పెద్దగట్టు జాతర ఫిబ్రవరి 16 నుండి ప్రారంభమై 20 వరకు సాగే జాతరలో వచ్చే భక్తులు, ప్రజలకు పురపాలిక ఆధ్వర్యంలో పారిశుధ్య నిర్వహణ పనులు ఎప్పటికప్పుడు భేష్ అనిపిస్తున్నాయి. భక్తులు మొక్కులు తీర్చానున్నడంతో జెట్టింగ్ మిషన్ ద్వారా రక్తపు మరకలు కనిపించకుండా శుభ్రం చేయడం జరిగింది. అదేవిధంగా పలు ప్రాంతాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో ప్రజలు అధికంగా త్రాగునీటిని వినియోగించుకొని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిదంగా జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పారిశుధ్య కార్మికులను నిర్దేశించిన ప్రాంతాలలో ఉంచి ఎప్పడికప్పుడు పాటిశుధ్య పనులు చేపడుతున్నారు. జిల్లా కలెక్టర్ దిశనిర్దేశ్యంతో దురాజ్ పల్లి జంక్షన్ నుండి గుడి చుట్టూ 8 జోన్లు ఏర్పాటు చేయడంతో పనులు మరింత వేగవంతంగా సాగుతున్నాయి. జాతరలో జోన్లల వారీగా కేటాయించి పారిశుద్ధ్య పనులు చేయుటకు మూడు షిఫ్టుల వారీగాసిబ్బందికి డ్యూటీ లు కేటాయించారు . షిఫ్ట్ ఒక్కంటికి 130 మంది పారిశుద్ధ్య కార్మికులను, 48 బాక్స్ మొబైల్ టాయిలెట్స్ క్లినింగ్ కు షిఫ్ట్ కు 16 మంది స్కా వెంజర్లు, 7 పర్మినెంట్ టాయిలెట్లు క్లినింగ్ కు 14 మంది స్కావెంజర్లు నియమించారు. వీరితో పనులు చేయించుటకు గాను 12 మంది జవాన్లు, 24 మంది సూపర్ వైజర్లు.24 మంది జోనల్ ఆఫీసర్లు ముగ్గురు శానిటరీ ఇన్స్పెక్టర్లు, మరుగుదొడ్ల క్లినింగ్ పనులు పర్యవేక్షణ చేయుటకు ముగ్గురు ని నియమించారు. జాతరలో చెత్త డంపింగ్ చేయుటకు గాను షిఫ్టుకు 4 ట్రాక్టర్లను ఏర్పాటు చేసి భక్తులు, ప్రజల మన్ననలు పొందుతున్నారు.