మోతే మీ న్యూస్ ప్రతినిధి : మోతే మండలం నామవరం జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ లో1999-2000 సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థిని ,విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శనివారం రోజు రాఘవాపురం ఎక్స్ రోడ్ లోని పిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు.25 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు. నాడు పాఠశాలలో గడిపిన మధుర స్మృతులను, జ్ఞాపకాలను గుర్తుకు చేసుకొని సంతోషంగా గడిపారు. నామవరం గ్రామంలోని జడ్పీ హైస్కూల్ లో చదువుకున్న విద్యార్థిని, విద్యార్థులు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో సిరపడి న వారు అందరూ హాజరై నాడు విద్యాబుద్ధులు నేర్పిన గురువులైన యాదగిరి, గోవర్ధన్ రెడ్డి, నర్సిరెడ్డి, ఖజా లను సాధారంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ25 సంవత్సరాల తరువాత మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఆహ్వానించి గత తీపి జ్ఞాపకాలను ఆస్వాదించేలా చేయడం, ప్రతి విద్యార్థి, విద్యార్థులు ఉన్నత స్థానాలలో స్థిరపడడం సంతోషదాయకమన్నారు.విద్యార్థులు, ఉపాధ్యాయులను మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని సన్మానించడం గురువులపై వారికున్న గౌరవానికి నిదర్శనం అన్నారు. నామవరం గ్రామంలోని జడ్పీ హైస్కూల్ లో చదువుకున్న అనేకమంది వివిధ స్థాయిల్లో స్థిరపడ్డారని అన్నారు. అనంతరం ఉపాధ్యాయులను శాలువాలు, పూల మాలలు తో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మట్టిపల్లి సైదు లు, భయ్యా గంగరాజు, కోలా కృష్ణ, కారింగుల వెంకన్న, బర్ల చౌదరి, ఝాన్సీ, జ్యోతి, నళిని, స్వాతి, తహసీ న్, రేణుక, రవి, నూర్జహాన్, శైలజ, రమేష్, జానయ్య, బిక్షం, రమాదేవి, జగదీష్, నవీన్, నాగయ్య, సునీత, తిరుపతయ్య, విద్యాసాగర్, నాగరాజు, వెంకన్న, మయూరి, తదితరులు పాల్గొన్నారు.