డెంగ్యూ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తం గా ఉండాలి

Uncategorized ఆరోగ్యం నల్లగొండ సూర్యాపేట

డెంగ్యూ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తం గా ఉండాలి

⏩:-జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కోటా చలం

 మీ న్యూస్ ప్రతినిధి మే 16:డెంగ్యూ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కోటా చలం అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్బంగా వైద్య ఆరోగ్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వైద్య సిబ్బంది రాబోయే వర్షాకాలం లో ఎప్పటికప్పుడు పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహనా కల్పిస్తూ డెంగ్యూ వ్యాధి పట్ల అప్రమత్తం గా ఉండేటట్లు చూడాలని సూచించారు.డెంగ్యూ వ్యాధి ఏడీస్ ఈజీప్ట్ అనే దోమ ద్వారా ఒకరినుంచి ఒకరికి వ్యాపిస్తుంది అని తెలిపారు. దోమలు ఇండ్ల పరిసరాలలో ఉన్న గాబులు, తొట్లు, డ్రమ్ములు, ట్యాంకుల లో ఉన్న నీటి నిలువ లో మరియు పాత టైర్లు, ఎయిర్ కూలర్ల లో, పూల కుండీలలో నిలువ ఉన్న నీటిలో గుడ్లు పెట్టి వృద్ధి చెందుతాయాన్నారు. కావున పైన తెలిపిన వాటిలో ఎప్పటికప్పుడు వృధా గా ఉన్న నీరు నిలువ లేకుండా శుభ్రం చేసుకోవాలని సూచించారు.దోమల ద్వారా డెంగ్యూ, చిగున్ గున్య తో పాటు మలేరియా, బోధకాలు, మెదడువాపు వ్యాధులు వ్యాపిస్తున్నాయాన్నారు.డెంగ్యూ వ్యాధి ఎలీసా పద్ధతి ద్వారా నిర్వహించే రక్త పరీక్ష తోనే నిర్ధారించాలని తెలియజేసారు. జిల్లా మలేరియా ప్రోగ్రాం అధికారి నాజియా మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి నమోదు అయిన ప్రాంతం లో ఇండ్లలో దోమల నివారణకు మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారం తో పైరేత్రం స్ప్రే నిర్వహిస్తున్నామన్నారు.వైద్య సిబ్బంది ఏ ఎన్ యం లు, ఆశ కార్యకర్తలు ప్రతి రోజు వారి ఏరియా లలో జ్వరం కేసులు సర్వే నిర్వహించాలని, ప్రతి మంగళవారం,శుక్రవారం డ్రై డే ప్రోగ్రాం లో పాల్గొని పరిసరాల పరిశుభ్రత పై అవగాహనా కల్పించాలని తెలిపారు. ప్రజలందరూ పడుకునే సమయం లో దోమ తెరలు వాడి దోమలు కుట్టకుండా చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో ప్రోగ్రాం అధికారులు జయ మోనోహరి, అశ్రీత, ఏ యంఓ మోతిలాల్, సబ్ యూనిట్ ఆఫిసర్ శ్రీనివాసరాజు, సూపర్వైసర్ వెంకన్న, మనోజ్ రెడ్డి, కడారి రమేష్, సైదులు,ఏ ఎన్ యం,ఆశాలు పాల్గొన్నారు.