ఇందిరమ్మ కమిటీలో అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూన్న అధికారులు
వివక్ష పై ఎంపిడిఓ ను నిలదిస్తున్న బి ఆర్ ఎస్ మండల పార్టీ నాయకులు
మీ టీవీ న్యూస్ అక్టోబర్15.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్ పరిధిలోని జరా సంగం మండల పరిధిలోని 33 గ్రామ పంచాయితీ లో ప్రతి గ్రామ పంచాయితీ లో ఇందిరమ్మ కమిటీలను గ్రామంలో ఎలాంటి సమాచారం లేకుండా ప్రతి గ్రామ పంచాయితీ నుండి ఐదు మంది సభ్యులను నియమించగా అందులో ఇద్దరు డ్వాక్రా మహిళా సభ్యులు, ముగ్గురు సభ్యులను ఇందిరమ్మ కమిటీ సభ్యులు గా నియమించుటకు గ్రామంలో గ్రామ సభ నిర్వహించి గ్రామ ప్రజల అందరి సమక్షంలో ఐదు మంది సభ్యులను నియమించాలి, కానీ మండలంలోని 33 గ్రామ పంచాయితీలలో ఎక్కడ కూడా గ్రామ సభలు సమావేశాలు నిర్వహించిన దాఖలాలు లేవు, ఏకపక్షంగా గుట్టు చప్పుడు కాకుండా అధికార పార్టీ నేతలు చెప్పిన వారి పేర్లు ఇందిరమ్మ కమిటీ లో సభ్యులు గా నియమించారు..దీనిపై ఆయా గ్రామ పంచాయితీ లలో పంచాయితీ కార్యదర్శి లను నిలదియగా మాకు ఎలాంటి సంబంధం లేదని, మండల పరిధిలోని మండల అభివృద్ధి అధికారి సమక్షంలో నియమించారు మాకు ఎలాంటి సంబంధం లేదని గ్రామ పంచాయితీ కార్యదర్శులు చెప్పడం తో మంగళవారం బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని 33 గ్రామ పంచాయితీ ల నుండి బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు,ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపిడిఓ గారితో మాట్లాడుతూ మాకు ఎలాంటి సమాచారం లేకుండా గ్రామాలలో గ్రామ సభలు సమావేశాలు నిర్వహించ కూడా ఏవిధంగా ఇందిరమ్మ కమిటీ లను నియమించారు . ప్రభుత్వ జీ ఓ లు ఏవిధంగా నియమించాలి అని ఉత్తర్వులు ఉన్నాయి. అని ఎలాంటి సమాచారం లేదని ఏవిధంగా ఇందిరమ్మ కమిటీ లను నియమించారు, మాకు ఎలాంటి సమాచారం లేదని చెప్పగా గ్రామ సెక్రటరీ లు ఎంపిడిఓ ఆధ్వర్యంలో నియమించారు మాకు బాధ్యత లేదు వారికి అడగండి అని అంటున్నారు అని మీరు ఏవిధంగా ఇందిరమ్మ కమిటీ లను నియమించారు, ప్రభుత్వ జీ ఓ లు ఏవిధంగా ఉన్నాయి అని ఎంపిడిఓ ను నిలదీశారు. మేము కూడా 33 గ్రమాలనుండి ప్రతి గ్రామం నుండి ఐదు మంది సభ్యులను నియమించాలి అని మేము కూడా ప్రతి గ్రామ పంచాయితీ నుండి ఐదు మంది సభ్యుల పేర్లు సూచిస్తున్నం వారు చెప్పినవి ఏవిధంగా కమిటీ సభ్యులు గా నియమించారో మేము చెప్పినవి కూడా కమిటీ సభ్యులు గా నియమించండి.అని ఎంపిడిఓ ను నిలదీశారు .ప్రభుత అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించక అధికార పార్టీ కి కొమ్ము కాస్తే అధికారం ఎవరికీ శాశ్వతం కాదని ప్రజాస్వామ్య బద్ధంగా అధికారులు పని చేయాలి అని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం లో పది సం రాలు కేసీఆర్ ముఖ్య మంత్రి గా ఉన్న నాల్గు కోట్ల మంది తెలంగాణ ప్రజలు తన బిడ్డలు గా భావించి పనిచేశారు.అని అప్పుడు పని చేసిన అధికారులు ఇప్పుడు ఉన్నారు అప్పుడు ఎప్పుడన్నా వివక్ష చూపార ఇప్పుడు ఎందుకు మీరు అధికార పార్టీ కొమ్ముకాస్తున్నారు అని అధికారం ఎవరికీ శాశ్వతం కాదని రేపు ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన కూడా ఇదే అధికారులు పని చేయాలి అని మార్చిపోరాదని అన్నారు.ప్రభుత్వ జీవోలు సూచించిన విధంగా నడుచుకోక అధికార పార్టీ కొమ్ము కాస్తే అధికారులను నిలదీస్తాం అని న్యాయ నిపుణుల అభిప్రాయం తో న్యాయ స్థానాలను సైతం ఆశ్రయిస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు ఎం వెంకటేశం మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు బొగ్గుల జగదీశ్వర్, మాజీ సర్పంచులు పరమేశ్వర్ పాటిల్, కృష్ణ,సిద్దన్న పాటిల్, బోజీ రెడ్డి, జగదీశ్వర్, అమర్ జిత్, యువ నాయకులు షేక్ సోయల్, దత్త రెడ్డి, మానిక్యం యాదవ్, శివ శంకర్ యాదవ్, ఎజజ్ బాబా, రాజు, శ్రీనివాస్ తది తరులు పాల్గొన్నారు .