సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు
మోతే: మీ న్యూస్ ప్రతినిధి::: మోతే బానోత్ బిక్షం నాయక్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. శుక్రవారం మోతే మండలం బిక్య తండా గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఆయన సంతాప సభకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ నాడు తెలంగాణ ప్రాంతంలో జరిగిన వీర తెలంగాణ సాయుధ పోరాటం లో ఈ ప్రాంతం నిర్వహించిన పాత్ర మరువలేదని అన్నారు. నాటి పోరాటం నుండి నేటి వరకు జరిగిన అనేక పోరాటాలలో బానోతు బిక్షం నాయక్ పాల్గొన్నారని అన్నారు. బానోతు బిక్షం నాయక్ కుటుంబం మొదటినుండి సిపిఎం పార్టీ కి అండదండలు ఇస్తూ ఈ ప్రాంతంలో ఎర్రజెండాను నిలబెట్టడంలో ప్రముఖ పాత్ర బానోతు బిక్షం నాయక్ పోషించారని అన్నారు. నేటి యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ములుకూరి గోపాల్ రెడ్డి,సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు కిన్నెర పోతయ్య, బానోతు లచ్చరాం నాయక్, నాగం మల్లయ్య, చర్లపల్లి మల్లయ్య, గుంట గాని ఏసు, బూడిద లింగయ్య, వెలుగు మధు చేగువేరా, బిక్క తండా సిపిఎం పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి భానోత్ వెంకన్న, నాయకులు బానోత్ శంకర్, బానోతు రమేష్ నాయక్, గురజాల రమేష్, దోస పాటి చిన్న శ్రీను, సైదా, వెంకన్న, కిషన్, రమేష్, చంద్రు నాయక్, గోలియా తదితరులు పాల్గొన్నారు.