విద్యరంగ సమస్యల పరిష్కారానికై ఛలో అసెంబ్లీ

Uncategorized నల్లగొండ సూర్యాపేట

విద్యరంగ సమస్యల పరిష్కారానికై ఛలో అసెంబ్లీ

       ఎర్ర అఖిల్ కుమార్ పిడిఎస్యు రాష్ట్ర సహయ కార్యదర్శి

 

మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 16

           విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ, తక్షణమే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పిడిఎస్యు ఆధ్వర్యంలో నేడు (మంగళవారం)నిర్వహించే “ఛలో అసెంబ్లీ” కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిడిఎస్యు రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్ పిలుపునిచ్చారు.ఈ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని లెనిన్ నగర్ లో విలేఖర్ల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పిడిఎస్యు రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన సంవత్సర కాలం పూర్తి చేసుకున్నప్పటికీ విద్యారంగ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని,నేటికీ విద్యారంగానికి కనీసం విద్యాశాఖ మంత్రిని కేటాయించలేదని, చిత్తశుద్ధితో రాష్ట్ర విద్య వ్యవస్థను గాడిన పెట్టే చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

డిమాండ్స్

 1)రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలి.

2)రాష్ట్ర బడ్జెట్లో విద్యా రంగానికి 30 శాతం నిధులు కేటాయించాలి.

3) ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలను, విద్యార్థుల ఆత్మహత్యలను నివారించాలి.

4) పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్, మెస్, కాస్మోటిక్ ఛార్జీల బకాయిలను విడుదల చేయాలి.

 5)ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలి.

6) ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి.

7)పిజీ ,డిగ్రీ సెల్ప్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులరైజ్ చేయాలి.

8) అమ్మ ఆదర్శ పాఠశాలలోని అసంపూర్ణ భవన నిర్మాణాలు, గురుకుల, సంక్షేమ హాస్టల్స్ కు సొంత భవన నిర్మాణాలు పూర్తి చేయాలి.

9) ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి.

 10)యూనివర్సిటీ విద్యార్థుల మెస్ బకాయిలన్నీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ డిమాండ్ల సాధనకై రేపు(17న) నిర్వహించే ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పిడిఎస్యు నాయకులు సూరం విజయ్, వినయ్,మాతంగి విజయ్, వివేక్, సాయి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.