మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి 12::::స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని జాయింట్ కలెక్టర్ పి రాంబాబు అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రం మున్సిపాలిటీ కార్యాలయం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ యువత వివేకనంద అడుగుజాడల్లో నడవాలని ఆయన మాటలే యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. యువత వివేకానందుని సందేశాలు విన్నంత మాత్రాన సరిపోదని వాటిని యువత ఆచరించాలని తెలిపారు. విద్యార్థులు ధైర్యంగా ఉండి సంఘ సేవ చేయాలన్నారు. భారతదేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని వారిని ఉత్తేజితుల్ని చేయడం ద్వారానే జాతి భద్రంగా ఉంటుందని వివేకానందుడు ప్రవచించారని వారు గుర్తు చేశారు. సెలవు రోజుల్లో ఒక గంట పాటు విద్యార్థులను సమీకరించి వారిచే వివేకానందుడి గురించి మాట్లాడించాల ని తద్వారా వ్యక్తిత్వ వికాసం తో పాటు సామాజిక పరిజ్ఞానం పెంపొందుతుందన్నారు. అనంతరం వివేకానందుడి వ్యాసరచన పోటీలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.మిమిక్రీ ఆర్టిస్ట్ నరేందర్ దేవరకొండ వివేకానంద మీద రచించి పాడిన పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్, మున్సిపల్ చైర్మన్ పెరుమళ్ళ అన్నపూర్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, యువజన క్రీడ యోజన అధికారి రామ్ చందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, ఉత్సవ కమిటీ అధ్యక్షులు అంగిరేకుల నాగార్జున, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, కోశాధికారి పర్వతం శ్రీధర్, ఉపాధ్యక్షులు డాక్టర్ కర్ణాకర్ రెడ్డి, తళ్ళమల హసేన్, చలమల నరసింహ, గజ్జల వెంకటరెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, గౌస్ మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.