గ్రామపంచాయతీ సిబ్బందిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి

Uncategorized నల్లగొండ రాజాకియం సూర్యాపేట

గ్రామపంచాయతీ సిబ్బందిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి

పెండింగ్ లో ఉన్న 5నెల జీతాలు విడుదల చేయాలి 

గ్రామపంచాయతీ కార్మిక సంఘం సిఐటియు ప్రధానకార్యదర్శి డిమాండ్

మీ న్యూస్. జనవరి 09 సూర్యాపేట జిల్లా ప్రతినిధి::: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పైన సూర్యాపేట ఎడిషన్ కలెక్టర్, డిపిఓ గారికి మెమోరండం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో నెమ్మాది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న 60 వేల మంది కార్మికులందరినీ శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి, వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలని ముఖ్యంగా పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించాలి అని గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం) జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లుడిమాండ్ చేశారు. గ్రామాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచి, ప్రజల ఆరోగ్యాన్ని, గ్రామాలను కాపాడుతున్న పారిశుద్ధ్య కార్మికుల పట్ల ప్రభుత్వ మొండి వైఖరి విడనాడి కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేసి, పదవీ విరమణ 10 లక్షల రూపాయల సౌకర్యం కల్పించి, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బహుళ పని విధానం గ్రామపంచాయతీ కార్మికులకు అతి ప్రమాదకరమైనదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ కార్మికుల మెడపై ఉరితాడు లా మారిన మల్టీపర్పస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం 9500 కనీస వేతనంగా నిర్ణయించి అమలు చేస్తుంటే ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి సంవత్సరకాలం గడిచిన గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పట్టించుకోవడంలేదని ఆవేదన చెందారు వెంటనే ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కరించాలి అని లేనిపక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సిఐటియు అనుబంధం సోమప్పంగు రాధాకృష్ణ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ధనియాకుల శ్రీనివాస్ ఉపాధ్యక్షులు రవిచంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు