రాయి కొట్టుకొని జీవించే మాపై దాడి చేసి దౌర్జన్యం చేస్తున్నారు

Uncategorized క్రైమ్ చివ్వేంల నల్లగొండ సూర్యాపేట

రాయి కొట్టుకొని జీవించే మాపై దాడి చేసి దౌర్జన్యం చేస్తున్నారు

మా ఆడవాళ్లను కొట్టి సెల్ ఫోన్లు, బంగారం ఎత్తుకెళ్లారు

పోలీసులు స్పందించి మాపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

మీ న్యూస్ చివ్వేంల్ల ప్రతినిధి జనవరి 09::రాయి కొట్టుకొని జీవిస్తున్న తమపై కొందరు ముఠాగా వచ్చి దాడి చేసి మా ఇంటి గోడను కూలగొట్టి మా ఆడవాళ్లను కొట్టి మూడు తులాల బంగారం తో పాటు రెండు సెల్ ఫోన్ లను ఎత్తుకెళ్లారని ఈ విషయమై చివ్వెంల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన స్పందించడం లేదని బాధితులు పల్లపు శంకర్ నిర్మల దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం వారి ఇంటి వద్ద విలేఖరులతో తమ గోడును వెళ్ళబోసుకున్నారు. 40 సంవత్సరాలుగా 65వ నెంబర్ జాతీయ రహదారి వెంట ఉన్న తెల్లబండ కాలనీలో తాము రెండు కుంటల ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకొని ఇద్దరు ఆడపిల్లలతో నివాసం ఉంటున్నామన్నారు. మా స్థలానికి ప్రభుత్వం కూడా పట్టాను ఇచ్చిందని మేము ఎన్నో ఏళ్లుగా పన్నులు కడుతూ ఇక్కడే రాయి కొట్టుకొని ఉంటూ జీవనం గడుపుతున్నామన్నారు. తెల్ల బండ కాలనీకి చెందిన పల్లపు లింగయ్య, పల్లపు కృష్ణ, పల్లపు రాజు, బోసు చిన్న, పల్లపు వెంకన్న, చంద్రయ్యలు ఈనెల 8న బుధవారం ఉదయం అకారణంగా మా ఇంటి గోడను కూల్చడంతో పాటు మా దంపతులపై మా కుమార్తెలపై దాడి చేసి మా ఇంటి గోడను కూల్చివేసారని ఆవేదన వ్యక్తం చేశారు. మాపై దాడి చేయడమే కాకుండా మా ఇంటి ఆడవాళ్లపై ఉన్న మూడు తులాల బంగారు గొలుసు రెండు సెల్ ఫోన్లను ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. తాము గాయాలతో రక్తం కారుతుండగానే చివ్వెంల పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశామని అయినప్పటికీ నేటి వరకు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి అకారణంగా మాపై దాడి చేసి మా బంగారం ఫోన్ లను ఎత్తుకెళ్లిన నిందితులను కఠినంగా శిక్షించి మాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.