హైటెక్ బస్టాండ్ లో గంజాయి   పట్టివేత 

Uncategorized క్రైమ్ నల్లగొండ సూర్యాపేట

హైటెక్ బస్టాండ్ లో గంజాయి   పట్టివేత 

 

 మీ న్యూస్ ప్రతినిధి:నల్గొండ జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశానుసారం నల్గొండ జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ సంతోష్, సూర్యాపేట జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్ లక్ష్మానాయక్ గార్ల ఆధ్వర్యంలో నిన్న రాత్రి సూర్యాపేటలోని హైటెక్ బస్టాండ్ పరిసరాల్లో సూర్యాపేట ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించినారు.ఈ తనిఖీలలో భాగంగా(175) గ్రాముల ఎండు గంజాయిని కలిగి ఉన్న బీహార్ రాష్ట్రంలోని పాట్నాకు చెందిన పప్పురే అనే ఒక వ్యక్తిని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించినారని, తదుపరి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సూర్యాపేట ఎక్సైజ్ సీఐ మల్లయ్య తెలిపినారు.ఈ దాడులలో ఎక్సైజ్ ఎస్సై సురేందర్ బెనర్జీ, హెడ్ కానిస్టేబుల్ లు గఫూర్, నజీర్ కానిస్టేబుళ్లు శ్రీను, వనజ,క్రాంతి, మోయిన్,ఇతర సిబ్బంది పాల్గొన్నారు.