సమ్మెకు సంఘీభావం తెలిపిన వట్టి జాన యాదవ్ 

Uncategorized నల్లగొండ రాజాకియం సూర్యాపేట

సమ్మెకు సంఘీభావం తెలిపిన వట్టి జాన యాదవ్ 

 

 

మీ న్యూస్ ప్రతినిధి జనవరి 4 ::: సర్వ శిక్షణ అభియాన్ గత 26 రోజుల నుండి వారి హక్కులకై రిలే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి ఒప్పంద ఉద్యోగులందరికీ సంఘీభావం తెలియజేసిన ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ డిసిఎంఎస్ చైర్మన్ జాన యాదవ్ (బీసీల ప్రతినిధి) వారిని ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను టీ తాగే లోపే పరిష్కరిస్తామని ఆనాటి ప్రతిపక్ష నేత ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నిస్తూ అధికారపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు వారి యొక్క జీతభత్యాలు పెంచుకుంటూ పోతూ వారి విలాసంతమైన జీవితం గడుపుతున్నారని కానీ వారికి ఓట్లు వేసి మనం మాత్రం ర్యాలీలు ధర్నాలు చేస్తూ చాలీచాలని జీతాలు తో కుటుంబాలు నెట్టుకొస్తున్న మనకి సుప్రీంకోర్టు ఇచ్చిన వంటి సమాన వేతనం అమలు చేయడానికి న్యాయపరమైనటువంటి చెక్కులు ఉన్నాయని దాటివేస్తూ ఈ ప్రభుత్వ కాలం వెళ్లబుచ్చుతున్నది అని ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అన్నపర్తి రాజేష్ కుంభం నాగరాజు మీరు అక్బర్ వల్లాల సైదులు వై ఆర్ ఎస్ ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బడుగుల నాగార్జున యాదవ్ చాంద్ పాషా ఆవుల అంజయ్య యాదవ్ లింగాల సైదులు మామిడి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు