కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి

Uncategorized నల్లగొండ మునుగాల రాజాకియం సూర్యాపేట

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి

 

 

 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి

 

మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 30::::మునగాల :- పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత బి ఆర్ అంబేద్కర్ ను అవమానిస్తూ ఎగతాళి చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని సిపిఎం పార్టీ మునగాల మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు డిమాండ్ చేశారు. మునగాల మండల కేంద్రంలో సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు మాట్లాడుతూ పార్లమెంటులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను కించపరిచే విధంగా హోం శాఖ కేంద్రమంత్రి అమిత్ షా మాట్లాడిన తీరు ఒంటినిండా మనువాదం భావాలను నింపుకొని అంబేద్కర్ను అవమానకరంగా మాట్లాడడం ఈ దేశ ప్రజల ఆత్మగౌరాణి కించపరచడమేనని అన్నారు ప్రపంచ దేశాలు మరియు ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు అంబేద్కర్ ని కీర్తిస్తుంటే మన దేశ పాలకులు మాత్రం ఇలా అవమానిస్తూ మాట్లాడటం సరి అయినది కాదని అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు షేక్ సైదా, జూలకంటి విజయలక్ష్మి, మండల కమిటీ సభ్యులు దేశి రెడ్డి స్టాలిన్ రెడ్డి, వెంకటాద్రి, మల్లారెడ్డి, సైదులు, కిన్నెర వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.